అతను ఇక్కడ పుట్టి ఉంటేనా, ఎప్పుడో పాక్ టీమ్‌కి ఆడేవాడు... ఉమ్రాన్ మాలిక్‌పై కమ్రాన్ అక్మల్...

First Published May 14, 2022, 5:29 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చి, 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న యంగ్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. 150+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్, ఓ మ్యాచ్‌లో 157 కి.మీ.ల వేగంతో బంతిని విసిరి... క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు...

రెగ్యూలర్‌గా 150+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్‌ని టీమిండియాకి ఎంపిక చేయాలని చాలామంది భారత మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. టీమిండియాకి ఉమ్రాన్ మాలిక్ ఫ్యూచర్ స్టార్ అవుతాడని అంటున్నారు...

Umran Malik

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఉమ్రాన్ మాలిక్‌కి చోటు కల్పించాలని డిమాండ్ చేసే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై ఉమ్రాన్ మాలిక్, భారత జట్టుకి ఆయుధంగా మారతాడని మరికొందరి అభిప్రాయం...

అయితే ఆర్పీ సింగ్, ఎమ్మెస్కే ప్రసాద్ వంటి మాజీ క్రికెటర్లు అయితే పెద్దగా దేశవాళీ అనుభవం కానీ, ఐపీఎల్ ఆడిన అనుభవం కానీ లేని ఉమ్రాన్ మాలిక్‌ని టీమిండియాకి ఎంపిక చేయడం తొందరపాటు అవుతుందని, అతన్ని ఇంకా సానబెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేశారు...

‘ఉమ్రాన్ మాలిక్, పాకిస్తాన్‌లో పుట్టి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడు. అతని ఎకానమీ చాలా ఎక్కువగా ఉంది, అయితే వికెట్లు కూడా తీస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌కీ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ వేగం పెరుగుతూ ఉంది...

భారత జట్టులో చాలా పోటీ ఉంది. ఇంతకుముందు టీమిండియాలో క్వాలిటీ ఫాస్ట్ బౌలర్లు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది...

నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా... ఇలా చాలామంది పేసర్లు టీమిండియాలో చోటు కోసం పోటీపడుతున్నారు. అందుకే ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్ దొరికినా, వారికి ఎలాంటి ఆతృత లేదు...

గత సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. పాకిస్తాన్‌లో పుట్టి ఉంటే, ఆ రెండు మ్యాచులు చాలు పాక్ టీమ్‌కి ఆడడానికి. కానీ భారత జట్టు మాత్రం చాలా మెచ్యూరిటీ చూపిస్తోంది...

ఐపీఎల్ సీజన్ మొత్తం ఆడిన ప్లేయర్లను కూడా కంగారుపడి జట్టుకి ఎంపిక చేయడం లేదు. బ్రెట్ లీ, షోయబ్ అక్తర్‌లు కూడా భారీగా పరుగులు ఇచ్చారు, కానీ వికెట్లు తీశారు. ఫాస్ట్ బౌలర్లలో ఉండే అడ్వాంటేజ్ ఇదే...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ మాలిక్... 

click me!