IPL2022 Mega Auction: ఇషాన్ కిషన్ కోసం గీత దాటిన ముబై ఇండియన్స్... హసరంగ, పూరన్‌లకు...

Published : Feb 12, 2022, 05:12 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఊహించనట్టుగానే ఇషాన్ కిషన్‌ భారీ ధర దక్కించుకున్నాడు. ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్ కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టని ముంబై ఇండియన్స్, ఈ మ్యాచ్ విన్నర్‌ని తిరిగి జట్టులోకి తెచ్చేందుకు ఏకంగా రూ.15.25 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది...

PREV
110
IPL2022 Mega Auction: ఇషాన్ కిషన్ కోసం గీత దాటిన ముబై ఇండియన్స్... హసరంగ, పూరన్‌లకు...

శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగను రూ.10.75 కోట్లకు దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. యజ్వేంద్ర చాహాల్‌ను బడ్జెట్ కారణాలతో రిటైన్ చేసుకోని ఆర్‌సీబీ, హసరంగ కోసం ఇంత మొత్తం చెల్లించేందుకు సిద్ధం కావడం ఆశ్చర్యానికి గురి చేసింది.
 

210

టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.8.75 కోట్లకు దక్కించుకుంది.. 2022 మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసిన మొదటి ప్లేయర్ సుందర్...

310

టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాని రూ.8.25 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొనుగోలు చేసింది... పాండ్యా కోసం సన్‌రైజర్స్‌తో పాటు గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా పోటీపడ్డాయి...

410

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ని రూ.6.5 కోట్లకు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్... మార్ష్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీపడింది...

510

ఆఫ్ఘాన్ ప్లేయర్ మహ్మద్ నబీతో పాటు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. 

610

టీమిండియా ప్లేయర్ అంబటి రాయుడిని రూ. 6.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది... సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాని ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు...

710

భారత యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్ కిషన్‌ని ముంబై ఇండియన్స్ జట్టు రూ. 15.25 కోట్లకు కొనుగోలు చేసింది...  ఇషాన్ కిషన్ కోసం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. అయితే ఎక్కడ తగ్గకుండా ధర పెంచుతూ పోయింది ముంబై ఇండియన్స్... 

810

భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది...

910

ఇంగ్లాండ్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ జానీ బెయిర్ స్టోని పంజాబ్ కింగ్స్ జట్టు రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది... 

1010

గత రెండు సీజన్లలో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వని విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది...

click me!

Recommended Stories