Published : Mar 28, 2022, 08:02 PM ISTUpdated : Mar 28, 2022, 08:03 PM IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రికెటర్ కెఎల్ రాహుల్. గత రెండు సీజన్లలో 600+ పైగా పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచిన కెఎల్ రాహుల్‌ను రూ.17 కోట్లకు డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...
గత నాలుగు సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన కెఎల్ రాహుల్, ఏటా రూ.1 1 కోట్ల పారితోషికం అందుకునేవాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో 670 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆరెంజ్ క్యాప్ గెలిచాడు...
212
ఐపీఎల్ 2021 సీజన్‌లో కడుపునొప్పితో ఓ మ్యాచ్‌కి దూరమైన కెఎల్ రాహుల్, 620+ పరుగులు చేసి... ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 3లో నిలవగలిగాడు...
312
గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి సారథిగా వ్యవహరించిన కెఎల్ రాహుల్, ఆరో స్థానంలో నిలపగలిగాడు. బ్యాటర్‌గా సక్సెస్ అయినా, కెప్టెన్‌గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు...
412
అయితే కెఎల్ రాహుల్‌ను రూ.15 కోట్ల వరకూ చెల్లించి రిటైన్ చేసుకోవాలని చూసింది పంజాబ్ కింగ్స్. అయితే రాహుల్ మాత్రం రూ.17 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్‌కి వెళ్లిపోయాడు...
512
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం అందుకున్న కెప్టెన్, ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు కెఎల్ రాహుల్. విరాట్ కోహ్లీ గత నాలగు సీజన్లలో ఆర్‌సీబీ కెప్టెన్‌గా రూ.17 కోట్లు అందుకున్నాడు...
612
రూ.17 కోట్లతో భారీ అంచనాలతో ఐపీఎల్ 2022 సీజన్‌ను ఆరంభించిన కెఎల్ రాహుల్‌కి శుభారంభం దక్కలేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే అవుట్ అయ్యాడు రాహుల్...
712
పంజాబ్ కింగ్స్‌లో తన టీమ్ మేట్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ బ్యాటును తాకుతూ వెళ్లిన బంతి, వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ చేతుల్లో వాలింది...
812
అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన గుజరాత్ టైటాన్స్‌కి అనుకూలంగా రిజల్ట్ దక్కింది. దీంతో కెఎల్ రాహుల్ మరోసారి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది...
912
కెఎల్ రాహుల్‌కి గత 6 ఏళ్లలో ఇది మొట్టమొదటి డకౌట్. గత నాలుగు సీజన్లలో దాదాపు 600+ (2018లో 659, 2019లో 593, 2020లో 670, 2021లో 626 పరుగులు) పరుగులు చేసిన కెఎల్ రాహుల్, డకౌట్ కాలేదు..
1012
2016లో గుజరాత్ లయన్స్‌పైన గోల్డెన్ డకౌట్ అయిన కెఎల్ రాహుల్, ఆరు సీజన్ల తర్వాత గుజరాత్ పేరున్న గుజరాత్ టైటాన్స్‌పై గోల్డెన్ డకౌట్ కావడం కొసమెరుపు...
1112
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో ఉన్న కెఎల్ రాహుల్, సౌతాఫ్రికా టూర్‌లో సారథిగా నాలుగు మ్యాచుల్లో ఓడి, చెత్త రికార్డు మూటకట్టుకున్న విషయం తెలిసిందే...
1212
కెఎల్ రాహుల్‌లో ఏ మూలన కెప్టెన్సీ లక్షణాలు కనిపిస్తున్నాయో, చూసేవాళ్లకే తెలియాలని ట్రోల్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు...