నేను వేలంలో దిగితే అంతకి తక్కువ కాకుండా ధర పలుకుతా... టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్...

Published : Mar 28, 2022, 06:41 PM IST

ఐపీఎల్ వేలంలో ఎక్కువ ధర దక్కించుకోవడమంటే, క్రికెట్ ప్రపంచంలో ఆస్కార్ అవార్డు పొందడంతో సమానం. సురేష్ రైనా వంటి తిరుగులేని రికార్డు ఉన్న ప్లేయర్‌ కూడా ఈ మెగా వేలంలో అమ్ముడుపోలేదు. అయితే ఐపీఎల్‌ వేలంలో తాను పాల్గొంటే, ఎంత ధర దక్కుతుందో కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...  

PREV
17
నేను వేలంలో దిగితే అంతకి తక్కువ కాకుండా ధర పలుకుతా... టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రవిశాస్త్రి, కాస్త బ్రేక్ తర్వాత ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు...

27

కామెంటరీ చెబుతున్న సమయంలో ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటే మీకు ఎంత ధర వస్తుంది? అనే ప్రశ్న ఎదురైంది రవిశాస్త్రికి..

37

‘నేను కేవలం ప్లేయర్‌గానే ఎంత లేదన్నా రూ.15 కోట్లు దక్కించుకునేవాడిని. కెప్టెన్‌గా కూడా అయితే అంతకుమించి ధర పలుకుతా...

47

అందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే ఊరుకునేది లేదు...’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...

57

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్‌గా కెరీర్ మొదలెట్టిన రవిశాస్త్రి, ఆ తర్వాత ఆల్‌రౌండర్‌గా మారి, టీమిండియాకి ఓపెనర్‌గా వ్యవహరించాడు...

67

టీమిండియా తరుపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన రవిశాస్త్రి, 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు...

77

తన టెస్టు కెరీర్‌లో 11 సెంచురీలు, వన్డే కెరీర్‌లో 4 సెంచరీలు చేసిన రవిశాస్త్రి... ఓవరాల్‌గా 180 వికెట్లు పడగొట్టాడు...

Read more Photos on
click me!

Recommended Stories