ఎసొంటి ప్లేయర్లు ఆడుతుంటే, ఏం హాలత్ అయిపోయింది... ఇది ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టేనా...

Published : Mar 28, 2022, 07:15 PM IST

ముంబై ఇండియన్స్... ఐపీఎల్‌లో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్‌లో ఒకటి. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, ఇప్పుడు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాల కారణంగా ముంబై ఇండియన్స్‌కి బీభత్సమైన క్రేజ్ దక్కింది. దాన్ని నిలుపుకుంటూ ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్...

PREV
110
ఎసొంటి ప్లేయర్లు ఆడుతుంటే, ఏం హాలత్ అయిపోయింది... ఇది ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టేనా...

ఐపీఎల్ 2019, 2020 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, గత ఏడాది నెట్ రన్‌రేట్ తక్కువగా ఉన్న కారణంగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను తృటిలో మిస్ చేసుకుంది...

210

ఐపీఎల్ 2021 సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి భారీ అంచనాలతో సీజన్‌ను మొదలెట్టింది. అయితే మొదటి మ్యాచ్‌లో ముంబైకి విజయం దక్కలేదు...

310

మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం, సీజన్‌ ముగిసే సమయానికి టాపర్‌గా నిలవడం ముంబై ఇండియన్స్‌కి ఆనవాయితీగా వస్తోంది. ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రం పోయేదేం లేదు...

410

అయితే ఈసారి ముంబై ఇండియన్స్ జట్టు కూర్పు మాత్రం ఐపీఎల్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొదటి రోజు నలుగురు ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేసింది ముంబై...

510

రెండో రోజు వేలంలోనూ ముంబై ఇండియన్స్ స్ట్రాటెజీ, క్రికెట్ ఫ్యాన్స్‌కి పెద్దగా అర్థం కాలేదు. మొత్తంగా ఈసారి వేలంలో ముంబై తీరు, ఫ్యాన్స్‌ని పెద్దగా మెప్పించలేదు...

610

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పర్ఫామెన్స్ ఎలా, జట్టు కూర్పు మాత్రం ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది...

710

బాసిల్ తంపి, అన్‌మోల్ ప్రీత్ సింగ్, డానియల్ సామ్స్, తైమల్ మిల్స్ వంటి ప్లేయర్లు... తుదిజట్టులో చోటు దక్కించుకోవడం... ముంబై ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది...

810

జేమ్స్ నీశమ్, నాథన్ కౌంటర్‌నైల్, క్రిస్ లీన్ వంటి స్టార్ ప్లేయర్లను రిజర్వు బెంచ్‌లో పెట్టుకుని, ఒకటి రెండు మ్యాచుల్లో ఆడించే ముంబై ఇండియన్స్... ఇలా మారిందేంటని తెగ బాధపడిపోతున్నారు అభిమానులు...

910

అయితే అనామక ప్లేయర్లను స్టార్లుగా మలచడం ముంబై ఇండియన్స్ ప్రత్యేకత. హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహార్... ఇలా ముంబై ఇండియన్స్ ద్వారా టీమిండియాకి ఎంట్రీ ఇచ్చినవాళ్లే...

1010

కాబట్టి మురుగన్ అశ్విన్, తిలక్ వర్మ, డేవాల్డ్ బ్రేవిస్, టిమ్ డేవిడ్ వంటి ప్లేయర్లను కరెక్టుగా వాడుకుని, స్టార్లుగా మలచగల సత్తా... రోహిత్ శర్మకు ఉందంటున్నారు మరికొందరు అభిమానులు...

Read more Photos on
click me!

Recommended Stories