IPL: కెప్టెన్ గా లేకున్నా అతడి శక్తి మాకు అవసరం.. కావల్సినంత వాడుకుంటాం: ఆర్సీబీ కొత్త సారథి షాకింగ్ కామెంట్స్

Published : Mar 13, 2022, 02:32 PM IST

RCB New Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు కొత్త కెప్టెన్ గా వచ్చిన డుప్లెసిస్.. రాగానే  జట్టులో  నెంబర్ వన్ ఆటగాడైన  మాజీ సారథి విరాట్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

PREV
17
IPL: కెప్టెన్ గా లేకున్నా అతడి శక్తి మాకు అవసరం.. కావల్సినంత వాడుకుంటాం: ఆర్సీబీ కొత్త సారథి షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ లో ఇంతవరకూ కప్ కొట్టని జట్టుగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త సీజన్ ను కొత్త సారథి తో ఆరంభిస్తున్నది. ఇన్నాళ్లు విరాట్ కోహ్లి మార్గ నిర్దేశనంలో నడిచిన ఆ జట్టుకు  ఇప్పుడు  ఫాఫ్ డుప్లెసిస్ సారథిగా వచ్చాడు. 

27

ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్.. పాత సారథితో ఎలా వ్యవహరిస్తాడు..? కోహ్లితో డుప్లెసిస్ సంబంధాలు ఎలా ఉంటాయి..? అనే విషయాలపై ఆర్సీబీ ఫ్యాన్స్ అప్పుడే లేక్కలు వేసుకుంటున్నారు. 

37

అయితే  ఈ ప్రశ్నలన్నింటికీ డుప్లెసిస్ సమాధానమిచ్చాడు.   కెప్టెన్ అయినా కాకున్నా ఆర్సీబీ లో కోహ్లి స్థానం ఏ మాత్రం మారదని, అతడి ఎనర్జీ ఎప్పుడూ తమకు కావాలని  డుప్లెసిస్ చెప్పాడు. 

47

కెప్టెన్ గా ఎంపికయ్యాక అతడు మాట్లాడుతూ... ‘అతడు (కోహ్లి) కెప్టెన్ కాకపోయినా  విరాట్ ఎనర్జీ మాకు అవసరం. అది మాకు ఎంతో ముఖ్యమైనది.  దానిని మేము ఎంత వాడాకోవాలో అంత వాడేసుకుంటాం... 

57

ఒక క్రికెటర్ గా కోహ్లి ఎదుగుదలను నేను ముందునుంచి గమనిస్తున్నాను.  ఆటగాడిగా బ్యాట్ తో పాటు ఒక  కెప్టెన్ గా అతడు ఏం సాధించాడో దాని పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన క్రికెటర్ అతడు.. 

67

నేను భారత్ కు వ్యతిరేకంగా చాలా కాలంగా (దక్షిణాఫ్రికా తరఫున) ఆడుతున్నాను.  కోహ్లి నాయకత్వంలో భారత జట్టు ఏ విధంగా రూపాంతరం చెందిందనేది నేను చూస్తున్నాను.  
 

77

భారత జట్టులో అతడు వేసిన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.  పోటీతత్వం, ఫిట్నెస్.. ఇటువంటి విషయాల్లో భారత్ ను అగ్రగామిగా నిలపడంలో కోహ్లి పాత్ర ఎంతో ఉంది. స్వదేశంలోనే గాక విదేశాల్లో కూడా  భారత జట్టు ఫైర్ తో ఆడుతుందంటే దానికి కారణం కోహ్లి అని చెప్పకతప్పదు..’ అని  డుప్లెసిస్ అన్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories