అతడో అద్భుతం.. అలాంటి బౌలర్ ఉండటం ఏ కెప్టెన్ కైనా అదృష్టం.. టీమిండియా పేసర్ పై సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Mar 13, 2022, 12:46 PM IST

India Vs Srilanka 2nd Test: బెంగళూరు టెస్టులో భారత్ తక్కువ స్కోరుకే వెనుదిరిగినా బౌలింగ్ లో మాత్రం అదరగొట్టింది. ఇప్పటికే లంక ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ ప్రదర్శనకు... 

PREV
112
అతడో అద్భుతం.. అలాంటి బౌలర్ ఉండటం ఏ కెప్టెన్ కైనా అదృష్టం.. టీమిండియా పేసర్ పై సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు

మునుపెన్నడూ  లేనంతగా ఇటీవలి కాలంలో భారత  బౌలింగ్ దళం బలం పుంజుకుంది. గతంలో ఏ ఒక్కరో ఇద్దరో ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి బౌలర్ కూడా తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న వాళ్లే.. 

212

స్పిన్ బౌలింగ్ ను కాసేపు పక్కనబెడితే  పేస్ బౌలింగ్ లో మాత్రం భారత్ అద్భుతాలు సృష్టిస్తున్నది.  మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా,  మహ్మద్ సిరాజ్ వంటి  బౌలర్లు  భారత్ కు స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా విజయాలను అందిస్తున్నారు. 

312

లంకతో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా భారత స్పిన్నర్లు  పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న వేళ  పేసర్లు  మాత్రం దుమ్ముదులిపారు. తొలి రోజు లంక కోల్పోయిన ఆరు వికెట్లలో 5 వికెట్లు పేసర్లకు దక్కినవే.

412

ముఖ్యంగా భారత సీనియర్ బౌలర్లు బుమ్రా, షమీ లు.. పిచ్  నుంచి లభిస్తున్న సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.  శనివారం ఆటలో బుమ్రా 3 వికెట్లు తీయగా.. షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. 

512

కాగా షమీ ప్రదర్శనపై భారత క్రికెట్ మాజీ దిగ్గజం  సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  అతడో అద్భుతమైన బౌలరని, అలాంటి బౌలర్ ఉండటం ప్రతి కెప్టెన్ కు ఎంతో లాభం చేకూర్చేదని అన్నాడు.

612

సన్నీ మాట్లాడుతూ.. ‘అవును, అతడు సుదీర్ఘ స్పెల్స్ వేయగలడు.  పేస్ ను  నిలకడగా వేస్తూ బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురాగలడు.  ప్రతి జట్టులో అలాంటి బౌలర్ ఒకరు ఉండాలి. షమీ అద్భుతమైన ఆటగాడు. 

712

కొన్నిసార్లు ప్రజలు వేగంగా బంతులు వేసే బౌలర్లను త్వరగా మరిచిపోతారు.  కానీ షమీ అలా కాదు. టీ20లలో నాలుగు ఓవర్ల స్పెల్స్ మాత్రమే కాదు..  టెస్టు  మ్యాచులలో సుదీర్ఘ స్పెల్స్ వేయగలడు. అతడో పని గుర్రం.  

812

షమీ ప్రతి బంతికీ కష్టపడతాడు. మీకు ఏ విధంగా కావాలంటే అలా బౌలింగ్ చేయగల సమర్థుడు. మణికట్టును ఉపయోగించి బంతిని ఏవిధంగా అయినా కదిలించగల బౌలర్.  షమీతో పాటు బుమ్రా కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు..’ అని సన్నీ చెప్పాడు. 
 

912

ప్రస్తుతం భారత బౌలింగ్ దాడి పూర్తిగా అద్భుతమైన దాడి అని గవాస్కర్ అన్నాడు. బుమ్రా, షమీలతో పాటు సిరాజ్ లు కొత్త బంతితో అద్భుతాలు చేస్తున్నారని సన్నీ కొనియాడాడు.  

1012

కాగా రెండో టెస్టులో భారత్.. తొలి ఇన్నింగ్స్ లో 59.1 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.  శ్రేయస్ అయ్యర్ (92)  పోరాటంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది.

1112

భారత్ ను తక్కువ స్కోరుకే ఔట్ చేశామన్న ఆనందం కూడా లంకకు దక్కలేదు.  ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.. 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు మాత్రమే చేసింది. బుమ్రా 3 వికెట్లు తీశాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె తో పాటు ధనంజయ డిసిల్వా లను షమీ ఔట్ చేశాడు.

1212

ముఖ్యంగా కరుణరత్నెను ఔట్ చేసిన బంతైతే అద్బుతం. ఆఫ్ స్టంప్ కు ఆవలగా వెళ్తుందనుకున్న బంతి.. లోపలికి చొచ్చుకువచ్చి వికెట్లను పడగొట్టింది. భారత బౌలర్ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్ లో లంక ఇంకా 166 పరుగులు వెనుకబడి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories