India Vs Srilanka 2nd Test: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ షాట్లు ఆడితే ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. ఒక్కోసారి అతడు కొట్టే సిక్సర్లు బౌలర్లు విసిరిన వేగం కంటే డబుల్ స్పీడ్ తో గ్రౌండ్ బయట పడతాయి. ఇక రెండో టెస్టులో....
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా సారథి రోహిత్ శర్మ.. మ్యాచ్ చూస్తున్న ఓ అభిమాని ముక్కు గాయానికి కారణమయ్యాడు.
27
రెండో టెస్టులో భాగంగా రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్సర్.. గ్రౌండ్ లో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుడి ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడికి తీవ్ర గాయమైంది.
37
భారత ఇన్నింగ్స్ సందర్భంగా.. విశ్వ ఫెర్నాండో వేసిన ఆరో ఓవర్లో బంతిని హిట్ మ్యాన్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. దీంతో రాకెట్ స్పీడ్ తో వెళ్లిన బంతి.. డీ కార్పొరేట్ బాక్స్ లో మ్యాచ్ చూడటానికి వచ్చిన 22 ఏండ్ల అభిమాని ముక్కుకు తాకింది.
47
బంతి బలంగా తాకడంంతో ఆ యువ అభిమాని అక్కడే తల్లడిల్లుతూ కింద పడిపోయాడు. ముక్కు నుంచి రక్తం కారడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.
57
వైద్య పరీక్షలో సదరు అభిమాని ముక్కుకు ఉండే ఎముక లో ఫ్రాక్చర్ అయిందని వైద్యులు తేల్చారు. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్సను అందిస్తున్నారు. ఇదిలాఉండగా ముక్కు పగిలిన అభిమాని కుటుంబసభ్యులు అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
67
కాగా ఈ టెస్టులో భారత్.. తొలి ఇన్నింగ్స్ లో 59.1 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ (92) పోరాటంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది.
77
భారత్ ను తక్కువ స్కోరుకే ఔట్ చేశామన్న ఆనందం కూడా లంకకు దక్కలేదు. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.. 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్ లో లంక ఇంకా 166 పరుగులు వెనుకబడి ఉంది.