ముంబై ఇండియన్స్‌లోకి కెఎల్ రాహుల్... పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా... ఐపీఎల్ 2022 సీజన్‌లో...

First Published Oct 29, 2021, 7:05 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడింది 13 మ్యాచులే అయినా 6 హాఫ్ సెంచరీలతో 626 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు కెఎల్ రాహుల్. అయితే వరుసగా రెండు సీజన్లలో 600+ పరుగులు చేసినా పంజాబ్ జట్టును విజయవంతంగా నడిపించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు...

పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ కెఎల్ రాహుల్ కెప్టెన్సీతో సంతృప్తికరంగా లేదు, కెప్టెన్‌ని మార్చాలని ఆలోచనలో ఉందని టాక్ వినిపించింది. కెఎల్ రాహుల్ కూడా జట్టు మారాలని ఆలోచిస్తున్నాడు...

లోకేశ్ రాహుల్, వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కెఎల్ రాహుల్ తాజాగా ఇన్‌స్టాలో ముంబై ఇండియన్స్‌ను ఫాలో అవుతుండడమే...

Latest Videos


కెఎల్ రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న రెండు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాత్రమే. దీంతో పంజాబ్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చేందుకు కెఎల్ రాహుల్ ఆసక్తి చూపిస్తున్నాడని టాక్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ. దాంతో కెఎల్ రాహుల్‌ను, ముంబైలోకి రావాల్సిందిగా రోహిత్ శర్మ కోరాడని టాక్ వినబడుతోంది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన స్టార్ క్రికెటర్లలో హార్ధిక్ పాండ్యా ఒకడు. ఈ సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన హార్ధిక్ పాండ్యా 14.11 సగటుతో 127 పరుగులు మాత్రమే చేసి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచాడు...

గత సీజన్‌లో బౌలింగ్ చేయకపోయినా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించి, ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు హార్ధిక్ పాండ్యా... ఐపీఎల్ 2020లో 14 మ్యాచుల్లో 281 పరుగులు చేశాడు పాండ్యా...

2020 సీజన్‌లో హార్ధిక్ పాండ్యా స్ట్రైయిక్ రేటు 178.98 కాగా, 2021 సీజన్‌లో స్ట్రైయిక్ రేటు కూడా ఘోరంగా పడిపోయింది. కేవలం 113.39 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన పాండ్యా, భారీ షాట్లు ఆడడానికి తెగ ఇబ్బందిపడ్డాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మెగా వేలం జరగబోతోంది. దీంతో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఏయే ప్లేయర్లను రిటైన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే ముంబై ఇండియన్స్‌లో ఉన్న 15 మంది కూడా మ్యాచ్ విన్నర్లే. వేలంలో చవకగా కొనుగోలు చేసినవాళ్లే... దీంతో ఎవరిని అట్టిపెట్టుకుంటారు, ఎవరిని వేలానికి వదిలి వేస్తారనేది ముంబై ఇండియన్స్ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాను రిటైన్ చేసుకోవడం ఖాయంగా మారింది. ఫారిన్ ప్లేయర్‌గా కిరన్ పోలార్డ్‌ను కూడా రిటైన్ చేసుకునేందుకే ఆసక్తి చూపిస్తుంది ముంబై...

ఇక మిగిలిన ఒక్క స్వదేశీ ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉంటాడా? ఇషాన్ కిషన్ ఉంటాడా? లేక హార్ధిక్ పాండ్యాని అట్టిపెట్టుకుంటారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది...

హార్ధిక్ పాండ్యాను రిటైన్ చేసుకునే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, వచ్చే సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడబోతున్నాడని టాక్ వినబడుతోంది...

వచ్చే సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీలు వస్తుండడంతో ఐపీఎల్ మెగా వేలానికి ముందే స్టార్ క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఎత్తులు వేస్తున్నాయి ఫ్రాంఛైజీలు. అందులో భాగంగానే ఈ ఇద్దరు ‘కాఫీ విత్ కరణ్ షో’ స్నేహితుల ప్లాన్స్ బయటికి వచ్చాయి... 

click me!