బట్లర్ చేసింది 800.. నేనే ఓపెనర్ అయితే 1,600 చేసేవాడిని.. అవన్నీ నాకు జుజూబి: యుజీ గొప్పలు మాములుగా లేవుగా..

Published : May 29, 2022, 04:20 PM IST

IPL 2022 Final GT vs RR: ఐపీఎల్-2022 లో ఆదివారం గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ  మ్యాచ్ తో సీజన్ ముగియనుంది.  ఇప్పటికే సీజన్ లో రాజస్తాన్ బ్యాటర్ జోస్ బట్లర్ 824 పరుగులు చేశాడు.

PREV
19
బట్లర్ చేసింది 800.. నేనే ఓపెనర్ అయితే 1,600 చేసేవాడిని.. అవన్నీ నాకు జుజూబి: యుజీ గొప్పలు మాములుగా లేవుగా..

ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్  సమిష్టిగా ఆడి ఫైనల్ చేరింది.  ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన వారిలో  ఆరెంజ్ క్యాప్ హోల్డర్ జోస్ బట్లర్ తో పాటు పర్పుల్ క్యాప్ ను దక్కించుకోబోతున్న యుజ్వేంద్ర చాహల్  లు తప్పకఉంటారు.

29

గుజరాత్ తో మ్యాచ్ లో ఈ ఇద్దరూ తప్పకుండా కీ రోల్ పోషిస్తారనంలో సందేహమే లేదు. ఈ సీజన్ లో  జోస్ బట్లర్ తాను ఆడిన 16 మ్యాచులలో ఏకగా 58.86 సగటుతో 824 పరుగులు చేశాడు.

39

బట్లర్  సాధించిన భారీ స్కోరు లో నాలుగు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ లీగ్ చరిత్రలో 800 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన వారిలో బట్లర్ మూడో వాడు. అంతకంటే ముందు విరాట్ కోహ్లి (974),  డేవిడ్ వార్నర్ (848) ఉన్నారు.

49

తన ఫామ్ తో  రికార్డులను బ్రేక్ చేస్తున్న బట్లర్ కు పోటీగా రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్  వచ్చాడు. ఒకవేళ తానే ఓపెనరైతే బట్లర్ కంటే డబుల్  స్కోర్ చేసేవాడినని చెప్పుకొచ్చాడు.

59

రాజస్తాన్ రాయల్స్ షేర్ చేసిన ఓ వీడియోలో చాహల్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ లో జోస్ (బట్లర్) భాయ్ 800 పరుగులు చేశాడు. నేనే గనక ఓపెనర్ అయి ఉంటే 1,600 రన్స్ చేసేవాడిని..’ అని అన్నాడు. అయితే  అక్కడే ఉన్న  ఓ క్రికెటర్.. ‘అసలు నీకు  అవకాశమే రాదు పో..’ అని అన్నాడు.

69

యుజీ అక్కడితో ఆగాడా..? అంటే అదీ లేదు.  బ్యాటర్లు తనను స్లో బౌలర్ అని భ్రమపడతారని కానీ తాను గంటకు 165 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ విసరగలిగే సత్తా ఉందని అన్నాడు.

79

‘నేను ఆఫ్ స్పిన్ కూడా వేస్తా. సూపర్ ఫాస్ట్  స్పీడ్ తో బౌలింగ్ వేస్తా నేను వేసే ఫస్ట్ బాల్ గంటకు 115 కిలోమీటర్ల వేగం ఉంటుంది. కానీ తర్వాత బంతి ఏకంగా 165 కి.మీ. స్పీడ్ తో వేస్తా. అంతే బ్యాటర్ బ్యాగ్ సర్దుకోవడమే..’ అని చెప్పాడు.

89

ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది.  ఈ వీడియోలో  చాహల్ ఆఖర్లో అన్న ‘బూమ్..  ఫినిష్’ అన్న మాటలను జత చేసి వీడియోను పోస్ట్ చేసింది.

99

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా  మారింది.  ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘యుజీ గొప్ప ఎంటర్ టైనర్..’ ‘చాహల్ తో అట్లుంటది మరి..’ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజన్ లో  చాహల్.. 16 మ్యాచులలో 26 వికెట్లు తీసి ఆర్సీబీ బౌలర్ వనిందు హసరంగతో సమానంగా ఉన్నాడు. గుజరాత్ తో మ్యాచ్ లో ఒక్క వికెట్ తీసినా  పర్పుల్ క్యాప్ విన్నర్ చాహలే.

click me!

Recommended Stories