ఐపీఎల్ 2022 సీజన్ క్లైమాక్స్‌కి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌తో 74 మ్యాచుల పాటు సాగిన మెగా సీజన్‌లో విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్‌లో ఫైనల్ చేరిన ఇద్దరు కెప్టెన్లలో ఎవరు గెలిచినా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నారు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా కొత్త జట్టుగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, ఛాంపియన్ జట్లకు చుక్కలు చూపిస్తూ ఫైనల్‌కి దూసుకొచ్చింది...
26
Photo source- iplt20.com
టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి వచ్చిన గుజరాత్ టైటాన్స్, మొదటి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం అందుకుని... ఫైనల్‌కి ఎంట్రీ ఇచ్చింది...
36
Photo source- iplt20.com
ఈ సీజన్‌లో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ టైటిల్ గెలిస్తే అతి తక్కువ మ్యాచుల్లో జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా రెండో స్థానంలో నిలుస్తాడు... ఓ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా బరిలో దిగలేదు.
46
Photo source- iplt20.com
2013 సీజన్ మధ్యలో రికీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ, 11 మ్యాచుల్లోనే టైటిల్ అందించాడు... 2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా టైటిల్ గెలిచిన షేన్ వార్న్ 16 మ్యాచుల్లో టైటిల్ గెలిచి, రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు... హార్ధిక్ పాండ్యా 15 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధిస్తే, రోహిత్ తర్వాతి ప్లేస్‌కి ఎగబాకుతాడు...
56
రాజస్థాన్ రాయల్స్‌ని 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేర్చిన సంజూ శాంసన్, ఈసారి టైటిల్ సాధిస్తే అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన రెండో కెప్టెన్‌గా నిలుస్తాడు...
66
Gujarat Titans vs Rajasthan Royals
2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో రోహిత్ శర్మ వయసు 26 ఏళ్లు కాగా సంజూ శాంసన్ ప్రస్తుత వయసు 27 ఏళ్ల 198 రోజులు..