ఐపీఎల్ 2022 సీజన్‌లో 8 మ్యాచుల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, జట్టులో ఎన్ని మార్పులు చేసినా ఏవీ వర్కవుట్ కాలేదు. అయితే ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి విజయం అందుకుంది ముంబై...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌లో స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో యువ క్రికెటర్లకు వరుస అవకాశాలు ఇచ్చింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, బేబీ ఏబీడీ డేవాల్డ్ బ్రేవిస్ సత్తా చాటుతుండగా ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో మరో కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు..
27
గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన మహ్మద్ అర్షద్ ఖాన్ స్థానంలో కుమార్ కార్తీకేయ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్. తొలి మ్యాచ్‌లోనే తన టాలెంట్ నిరూపించుకున్నాడీ యంగ్ బౌలర్...
37
4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చిన కుమార్ కార్తీకేయ సింగ్, ఐపీఎల్‌లో వేసిన రెండో బంతికే సంజూ శాంసన్‌ను అవుట్ చేశాడు... 4.80 ఎకానమీతో పరుగులు ఇచ్చిన కుమార్ కార్తీకేయ, ముంబై ఇండియన్స్ తరుపున బెస్ట్ బౌలింగ్ నమోదుచేశాడు..
47
24 ఏళ్ల కుమార్ కార్తీకేయ, మధ్యప్రదేశ్ తరుపున మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 19 లిస్ట్ ఏ మ్యాచులు, 8 టీ20 గేమ్స్ ఆడిన కుమార్ కార్తీకేయ... మొత్తంగా 62 వికెట్లు పడగొట్టాడు...
57
‘నేను 9 ఏళ్లుగా ఇంటికి వెళ్లలేదు. జీవితంలో ఏదైనా సాధించిన తర్వాతే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుని, బయటికి వచ్చేశా... మా అమ్మ, నాన్న చాలాసార్లు ఫోన్ చేసి రమ్మని పిలుస్తున్నారు...
67
అయితే నేను మాత్రం నా లక్ష్యంమీదే నిలబడ్డాను. ఇప్పుడు నేను ఎంతో కొంత సాధించా... ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లబోతున్నా...
77
సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడిన తర్వాత నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అదే భరోసాతో నేడు బరిలో దిగాను...’ అంటూ కామెంట్ చేశాడు కుమార్ కార్తీకేయ సింగ్...