అది అనాలోచిత నిర్ణయం.. ఆ బాధ్యతలు రోహిత్ పై మరింత ఒత్తిడిని పెంచుతాయి: యువరాజ్ షాకింగ్ కామెంట్స్

Published : Apr 30, 2022, 06:19 PM IST

TATA IPL 2022 RR vs MI: టీమిండియాకు మూడు ఫార్మాట్లలో సారథిగా వ్యవహరిస్తున్న  రోహిత్ శర్మ కు టెస్టు కెప్టెన్సీ అప్పగించడం పై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అది అనాలోచిత నిర్ణయమని చెప్పుకొచ్చాడు. 

PREV
18
అది అనాలోచిత నిర్ణయం.. ఆ బాధ్యతలు రోహిత్ పై మరింత ఒత్తిడిని పెంచుతాయి: యువరాజ్ షాకింగ్ కామెంట్స్

టీమిండియాకు విరాట్ కోహ్లి తర్వాత అన్ని ఫార్మాట్లలో సారథిగా ఎంపికైన రోహిత్ శర్మ కు టెస్టు జట్టు పగ్గాలు అప్పగించడం అనాలోచితన నిర్ణయమని  యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అది బావోద్వేగ నిర్ణయమని తెలిపాడు. 

28

ఓ జాతీయ  న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘ఫిట్నెస్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రోహిత్ శర్మ ను టీమిండియా  టెస్టు కెప్టెన్ గా చేశారు. అది అనాలోచిత నిర్ణయం.  రోహిత్ గత రెండేండ్లుగా వరుసగా గాయాల బారిన పడుతున్నాడు. 

38

టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అతడిపై మరింత ఒత్తిడిని పెంచుతాయి.  రోహిత్ టెస్టులలో పూర్తి స్థాయి ఓపెనర్ గా మారి రెండేండ్లు మాత్రమే అయింది.  టెస్టు బ్యాటర్ గా అతడు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాడు. 

48

ఇలాంటి సమయంలో బ్యాటింగ్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం అతడితో పాటు టీమిండియాకూ ఎంతో ముఖ్యం. అయితే టెస్టు సారథ్యం అతడి బ్యాటింగ్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది..’ అని యువీ తెలిపాడు. 

58

అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో రోహిత్ కు ఇంకా ముందే  కెప్టెన్సీ దక్కాల్సి ఉండేదని, అయితే  కోహ్లి అన్ని ఫార్మాట్లలో అదరగొడుతుండటంతో ఆ అవసరం భారత్ కు లేకపోయిందని యువీ  చెప్పాడు. 

68

‘వైట్ బాల్ క్రికెట్ లో రోహిత్ కు నాయకత్వ పగ్గాలు ముందే అప్పగించాల్సి ఉంది. అయితే  విరాట్ కోహ్లి టీమిండియాను సమర్థవంతంగా నడుపుతుండటంతో  అది సాధ్యపడలేదు. 

78

పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మ అద్భుత నాయకుడు.. ఈ విషయాన్ని ఐపీఎల్ లో నేను ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడే గమనించాను. అతడు మంచి ఆలోచనాపరుడు.  పరిమిత ఓవర్ల క్రికెట్ లో సారథిగా నా ఓటు రోహిత్ కే..’ అని యువీ ముగించాడు. 

88

కాగా.. టెస్టు జట్టులో రోహిత్  నిష్క్రమణ తర్వాత  ఆ బాధ్యతలను టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు అప్పగిస్తే బాగుంటుందని యువరాజ్ ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. శనివారం రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా   సోషల్ మీడియా వేదికగా  యువీ.. అతడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. 

Read more Photos on
click me!

Recommended Stories