ఐపీఎల్ 2022 సీజన్ సందడే అప్పుడే మొదలైపోయింది. వచ్చే సీజన్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు. ఇప్పటికే ఈ రెండు జట్ల హెడ్ కోచ్‌లు, మెంటర్‌లపై ఓ క్లారిటీ రాగా, మెగా వేలానికి ముందే ‘ఫ్రీ టికెట్’ ద్వారా ప్లేయర్లను ఎంచుకునే అవకాశం దక్కడంతో ఆ పనిలో తెగ బిజీగా ఉన్నాయి లక్నో, అహ్మదాబాద్...
లక్నో ఫ్రాంచైజీ మెంటర్‌గా గౌతమ్ గంభీర్, హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది...
214
రూ.7090 కోట్ల భారీ ధర చెల్లించి లక్నో జట్టును బిడ్డింగ్‌లో దక్కించుకున్న ఆర్‌పీఎస్ గోయింకా గ్రూప్... రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల పేర్లను లక్నో ఫ్రాంఛైజీగా మార్చేసింది...
314
జట్టు పేరును నిర్ణయించే అవకాశం అభిమానులకే ఇచ్చింది ఫ్రాంఛైజీ. అభిమానులు సూచించే పేర్లలో బెస్ట్ అనుకున్నదాన్ని టైటిల్‌గా ఎంచుకోనుంది లక్నో ఫ్రాంఛైజీ...
414
మరోవైపు రూ.5625 కోట్ల మొత్తానికి అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్ కూడా లక్నోకి తగ్గకుండా జట్టు ఎంపిక విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది...
514
అహ్మదాబాద్ మెంటర్‌గా 2011 వన్డే వరల్డ్ కప్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్, హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా ఎంపికైనట్టు సమాచారం...
614
అహ్మదాబాద్ బ్యాటింగ్ కోచ్‌గా, క్రికెట్ డైరెక్టర్‌గా విక్రమ్ సోలంకి ఎంపికైనట్టు సమాచారం. అయితే ఇప్పటిదాకా అహ్మదాబాద్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు...
714
అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. ఇంతకుముందు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రెండు సీజన్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించాడు శ్రేయాస్ అయ్యర్..
814
2019 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆరేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్, 2020 సీజన్‌లో మొట్టమొదటిసారిగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది...
914
అయితే 2021 సీజన్ ఆరంభానికి ముందు శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అతని స్థానంలో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ అప్పగించింది టీమ్ మేనేజ్‌మెంట్. పంత్ కెప్టెన్సీ నచ్చడంతో అయ్యర్ కోలుకున్న తర్వాత కూడా కెప్టెన్‌గా అతన్నే కొనసాగించింది...
1014
కెప్టెన్సీ పోవడంతో తెగ ఫీలైన శ్రేయాస్ అయ్యర్, జట్టును వీడాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ 2022 రిటెన్షన్స్‌లోనూ అతనికి చోటు దక్కలేదు...
1114
ఐపీఎల్ 2022 సీజన్‌లో అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడని, అతన్ని రూ.15 కోట్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు సదరు ఫ్రాంఛైజీ ముందుకొచ్చిందని వార్తలు వినిపించాయి...
1214
అయితే ఇప్పుడు సీన్ మారింది. శ్రేయాస్ అయ్యర్‌కి బదులుగా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వాలని ఆలోచిస్తోందట అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ...
1314
హార్ధిక్ పాండ్యాతో పాటు రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్‌లను కూడా అహ్మదాబాద్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఎంచుకుందని పీటీఐ (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) తెలియచేసింది..
1414
ఇదే నిజమైతే కెప్టెన్సీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వీడిన శ్రేయాస్ అయ్యర్‌కి ఊహించని షాక్ తగిలినట్టే అవుతుంది. కేకేఆర్, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ వంటి జట్లలో కెప్టెన్సీ కోసం అయ్యర్ ప్రయత్నించాల్సిన పరిస్థితి...