అతడికి అనవసర విషయాల్లో తలదూర్చే అలవాటు ఎక్కువ.. ఇంగ్లాండ్ మాజీ సారథిపై వసీం జాఫర్ కామెంట్స్

Published : Jan 10, 2022, 05:27 PM IST

Wasim Jaffer On Michael Vaughan:  తమకేమీ అవసరం లేకున్నా భారత జట్టు ఆటతీరు, ఆటగాళ్ల మీద  కామెంట్లు చేయడం..  పాపులారిటీ సంపాదించుకోవడం వంటివి కొంత మంది చేస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ సారథి వాన్ కూడా...

PREV
18
అతడికి అనవసర విషయాల్లో తలదూర్చే అలవాటు ఎక్కువ.. ఇంగ్లాండ్ మాజీ సారథిపై వసీం జాఫర్ కామెంట్స్

టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కు ఇంగ్లాండ్  మాజీ సారథి మైఖేల్ వాన్ కు ట్విట్టర్ వార్ ఇప్పటిది కాదు. తమ ప్రత్యర్థి జట్టును విమర్శించడానికి ఏ చిన్న సందర్భం దొరికినా ఈ ఇద్దరూ ఒకరిమీద ఒకరు ట్వీట్లతో విరుచుకుపడుతుంటారు. 

28

అయితే మైఖేల్ వాన్ కు కొంచెం తిక్కని, తనకు ఏం సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చుతాడని వసీం జాఫర్ సంచలన కామెంట్స్ చేశాడు. 

38

వాన్ తో ట్విట్టర్ ఫైట్లు, ఇతరత్రా అంశాల గురించి జాఫర్.. ఓ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా వ్యాఖ్యానించాడు. 

48

ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ.. ‘అతడి (మైఖేల్ వాన్)కి అనవసరమైన విషయాలలో తలదూర్చే అలవాటు ఎక్కువగా ఉంది. అది నాకస్సలు నచ్చదు. తనకు సంబంధం లేకున్నా భారత అభిమానులను ఏదో విధంగా పోక్ చేస్తూనే ఉంటాడు. 

58

అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు ఏమంత గొప్పగా ప్రదర్శిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆసీస్  వేదికగా జరుగుతున్న యాషెస్ లో  ఆ జట్టు ప్రతిభ ఏపాటిదో మనం చూస్తున్నాం..’ అని అన్నాడు. 

68

వాన్ మాదిరి తమకు  సంబంధం  లేని విషయాలపై టీమిండియా అభిమానులు  తలదూర్చరని  జాఫర్ చెప్పాడు. ‘వాన్ చేసినట్టు మనోళ్లు ప్రవర్తించరు. ఏదేమైనా వాన్ తో నా ట్విట్టర్ ఫైట్ స్నేహపూర్వకంగానే ఉంటుంది. మేమిద్దరం కలిసి ప్రత్యర్థులుగా చాలా  కాలం క్రికెట్ ఆడాం..’ అని  జాఫర్ తెలిపాడు. 

78
wasim jaffer

88

భారత జట్టు ఇంగ్లాండ్ కు వెళ్లినా.. ఇంగ్లాండ్ ఇండియాకు వచ్చినా  క్రికెటర్ల మధ్య ఫైట్ కంటే అభిమానులు ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్ల మధ్య ట్విట్టర్ వార్ ను అభిమానులు ఎంజాయ్ చేస్తారు. జాఫర్ కు మద్దతుగా టీమిండియ ఫ్యాన్స్ ఉంటే.. వాన్ కు సపోర్ట్ గా ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు.

click me!

Recommended Stories