సున్నాల రికార్డు కొట్టిన బంగ్లా క్రికెటర్... ఒకటీ, రెండూ కాదు వరుసగా పదిసార్లు పరుగులేమీ చేయకుండానే...

Published : Jan 10, 2022, 04:55 PM ISTUpdated : Jan 10, 2022, 04:56 PM IST

సెంచరీ చేయకపోయినా పర్వాలేదు కానీ కనీసం డకౌట్ కాకూడదని కోరుకుంటారు క్రికెటర్లు. టెయిలెండర్లుగా పిలవబడే బౌలర్లు కూడా ఉన్నంతసేపు ఎంతో కొంత పరుగులు చేసి పెవిలియన్ చేరాలని అనుకుంటారు. అయితే ఓ బంగ్లా క్రికెటర్ మాత్రం సున్నాలు చేయడంలో రికార్డు కొట్టాడు...

PREV
18
సున్నాల రికార్డు కొట్టిన బంగ్లా క్రికెటర్... ఒకటీ, రెండూ కాదు వరుసగా పదిసార్లు పరుగులేమీ చేయకుండానే...
Ebadot Hossain

బంగ్లాదేశ్ యంగ్ క్రికెటర్ ఎబాడత్ హుస్సేన్, 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. బంగ్లా ఎయిర్‌ఫోర్స్‌ సోల్జర్‌గా ఉన్న హుస్సేన్, టెస్టు క్రికెటర్‌గానూ రాణిస్తున్నాడు...

28

ఇప్పటిదాకా 11 టెస్టులు ఆడిన ఎడాబత్ హుస్సేన్, 18 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌ టూర్‌లో బే ఓవల్‌లో జరిగిన మొదటి టెస్టులో 46 పరుగులకే 6 వికెట్లు తీసి న్యూజిలాండ్ జట్టును స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు హుస్సేన్...

38

ఎడాబత్ హుస్సేన్ సంచలన బౌలింగ్ పర్ఫామెన్స్ కారణంగా న్యూజిలాండ్‌లో తొలి టెస్టు విజయాన్ని అందుకోగలిగింది బంగ్లాదేశ్ జట్టు. ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన ఎడాబత్ హుస్సేన్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు...

48

అయితే 11 టెస్టులు ఆడిన ఎడాబత్ హుస్సేన్, తాను బంతిని ఎదుర్కొన్న 17 ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసింది నాలుగంటే నాలుగు పరుగులే. అత్యధిక స్కోరు 2 పరుగులు మాత్రమే...

58

టెస్టు క్రికెట్ చరిత్రలో 17 ఇన్నింగ్స్‌ల తర్వాత అతి తక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర తిరగరాశాడు ఎడాబత్ హుస్సేన్. జింబాబ్వే క్రికెటర్ పోమీ బాంగ్వా 16 పరుగులు చేస్తే, జస్ప్రిత్ బుమ్రా 17 టెస్టు ఇన్నింగ్స్‌ల తర్వాత 18 పరుగులు చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు...

68

వరుసగా 10 మ్యాచుల్లో పరుగులేమీ చేయలేకపోయిన మొదట బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు ఎడాబత్ హుస్సేన్. గత 10 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు పరుగులేమీ చేయకుండా సున్నా వద్ద నాటౌట్‌గా నిలిచిన హుస్సేన్, 3 సార్లు డకౌట్ అయ్యాడు...

78

2019లో ఇండియాతో జరిగిన కోల్‌కత్తా టెస్టులో ఎడాబత్ హుస్సేన్, చివరిగా బ్యాటుతో పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో హుస్సేన్ 2 పరుగులు తీయగా, షార్ట్ రన్‌గా సింగిల్ మాత్రమే ఇచ్చారు అంపైర్లు... ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆఖరిగా సెంచరీ చేయడం విశేషం.

88

న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ మార్టిన్, శ్రీలంక క్రికెటర్ లహీరు కుమార వరుసగా 9 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో సున్నాలు చుట్టగా, ఆ రికార్డును దాటి 10 ఇన్నింగ్స్‌ల్లో పరుగులేమీ చేయకుండా సున్నాల రికార్డు కొట్టాడు ఎడాబత్ హుస్సేన్... 

click me!

Recommended Stories