టీమ్ అలాగే ఉంది, లోగో కూడా అలాగే ఉంది... గుజరాత్ టైటాన్స్ లోగోపై...

Published : Feb 20, 2022, 05:41 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న రెండు జట్టలో గుజరాత్ టైటాన్స్ ఒకటి. మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్, జట్టు పేరును, లోగోని, సోషల్ మీడియా అకౌంట్లను అప్పుడెప్పుడో విడుదల చేస్తే... గుజరాత్ టైటాన్స్ ఆలస్యంగా నిద్ర లేచింది...

PREV
110
టీమ్ అలాగే ఉంది, లోగో కూడా అలాగే ఉంది... గుజరాత్ టైటాన్స్ లోగోపై...

ఐపీఎల్ మెగా వేలానికి ముందు హడావుడిగా ఫ్రాంఛైజీ పేరును డిసైడ్ చేసిన గుజరాత్ టీమ్ ఓనర్లు, తాజాగా అఫిషియల్ లోగోను విడుదల చేశారు..

210

ఈ లోగో జట్టులాగే ఏ మాత్రం కొత్తదనం లేకుండా కింద సొట్టపడిన  ఓ త్రిభుజంలో గుజరాత్ టైటాన్స్ అని రాసి ఉందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

310

సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సంస్థ సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకి ఆశీష్ నెహ్రా హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే..

410

భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించే గుజరాత్ టైటాన్స్ జట్టు... రషీద్ ఖాన్‌ను రూ.15 కోట్లకు, శుబ్‌మన్ గిల్‌ను రూ.8 కోట్లకు డ్రాఫ్ట్‌లుగా కొనుగోలు చేసింది...

510

పేసర్ లూకీ ఫర్గూసన్‌ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్, యంగ్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా కోసం ఏకంగా రూ.9 కోట్లు ఖర్చు చేసింది...

610

భారత పేసర్ మహ్మద్ షమీని రూ.6.25 కోట్లకు కొన్న గుజరాత్ టైటాన్స్, జాసన్ రాయ్‌ని రూ.2 కోట్లకు, అభినవ్ సదరంగనీని రూ.2.6 కోట్లకు, ఆర్ సాయి కిషోర్‌ని రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది...

710

జయంత్ యాదవ్, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, గురుకీరత్ సింగ్, వరుణ్ అరోన్, డేవిడ్ మిల్లర్, యశ్ దయాల్ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు కూర్పుపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది...

810

హార్ధిక్ పాండ్యాని రూ.15 కోట్లు పెట్టి కెప్టెన్‌గా ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించినా చాలా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చినట్టే అని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

910

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ టీమ్ పేరును, అధికారిక లోగోను, సోషల్ మీడియా అకౌంట్లను కాపీ చేస్తే.. గుజరాత్ టైటాన్స్, ఏదో చేయాలి కాబట్టి మొక్కుబడిగా టీమ్ పేరు, లోగో విడుదల చేసినట్టుగా ఉందని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

1010

లక్నో ఫ్రాంఛైజీ భారీగా ఖర్చు పెట్టి ఓ ప్లానింగ్ లేకుండా ప్లేయర్లను కొనుగోలు చేస్తే, గుజరాత్ టైటాన్స్... మిగిలిన ఫ్రాంఛైజీలు పోటీపడి వదిలేసిన ప్లేయర్లను తెచ్చుకుందనే ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories