నేను ఆడిన ప్రతీ ఫైనల్ గెలిచాను... ఫైనల్‌కి ముందు హార్ధిక్ పాండ్యా ధీమా...

Published : May 29, 2022, 04:32 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు తీసుకుని, మొదటి సీజన్‌లోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు హార్ధిక్ పాండ్యా. అసలు ఏ మాత్రం అంచనాలు లేని జట్టుగా సీజన్‌ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, జెట్ స్పీడ్‌తో ఫైనల్‌కి దూసుకువస్తుందని ఎవ్వరూ ఊహించలేదు...

PREV
17
నేను ఆడిన ప్రతీ ఫైనల్ గెలిచాను... ఫైనల్‌కి ముందు హార్ధిక్ పాండ్యా ధీమా...

2015 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతూ వచ్చిన హార్ధిక్ పాండ్యాకి ఐపీఎల్ 2022 సీజన్‌ రిటెన్షన్‌లో చోటు దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కిరన్ పోలార్డ్‌లను అట్టిపెట్టుకుంది ముంబై ఇండియన్స్...
 

27

గాయం కారణంగా గత రెండు సీజన్లలో బౌలింగ్ వేయలేకపోయిన హార్ధిక్ పాండ్యాని మెగా వేలానికి విడుదల చేసింది. గుజరాత్ టైటాన్స్, వేలానికి ముందే డ్రాఫ్ట్ రూపంలో పాండ్యాని రూ.15 కోట్లకు కొనుగోలు చేసి, కెప్టెన్సీ అప్పగించింది...

37
Image credit: PTI

2022లో కెప్టెన్‌గా కొత్త కెరీర్ మొదలెట్టిన హార్ధిక్ పాండ్యా, ఊహించని రీతిలో సూపర్ సక్సెస్ సాధించాడు. ఈ సీజన్‌లో లీగ్ స్టేజీలో 10 విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా నిలిచిన హార్ధిక్ పాండ్యా, జట్టును ఫైనల్‌కి తీసుకొచ్చాడు...

47

‘నేను ఇప్పటివరకూ ఆడిన ఏ ఫైనల్ మ్యాచ్ ఓడిపోలేదు...’ అంటూ ఫైనల్ మ్యాచ్‌కి ముందు ధీమా వ్యక్తం చేశాడు హార్ధిక్ పాండ్యా. 2015 సీజన్‌లో, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ ఫైనల్ మ్యాచులు ఆడిన హార్ధిక్ పాండ్యా, ప్రతీ సీజన్‌లోనూ టైటిల్ గెలిచాడు...

57

అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రమే ఆ క్రెడిట్ దక్కుతుంది. అందులో హార్ధిక్ పాండ్యా దక్కే క్రెడిట్ తక్కువే. దీంతో కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా ఫైనల్ మ్యాచ్‌లో ఇదే ఫీట్ రిపీట్ చేయగలడా? అనేది ఆసక్తికరంగా మారింది...

67

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా ఏ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. 2008 సీజన్‌లో ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్, అండర్‌ డాగ్స్‌గా బరిలో దిగి మొట్టమొదటి టైటిల్ విన్నర్‌గా నిలిచింది...

77

ఆ తర్వాత 14 సీజన్లలోనూ ఫైనల్‌కి చేరలేకపోయింది రాజస్థాన్ రాయల్స్. మరి ఇన్నేళ్లకు మళ్లీ ఫైనల్ ఆడబోతున్న రాజస్థాన్ రాయల్స్, ఫైనల్‌లో ఓటమి ఎరుగని హార్ధిక్ పాండ్యాకి తొలి పరాజయాన్ని రుచి చూపించగలదా? అనేది వేచి చూడాలి... 

click me!

Recommended Stories