రాబిన్ ఊతప్ప... ఐపీఎల్ ఆరంభానికి ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్లలో ఒకడు. 2006లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రాబిన్ ఊతప్ప, తన అంతర్జాతీయ కెరీర్‌లో 46 వన్డేలు, 13 టీ20 మ్యాచులు ఆడగలిగాడు...
తన అంతర్జాతీయ కెరీర్‌లో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా వచ్చిన రాబిన్ ఊతప్ప, ఓవరాల్‌గా 7 హాఫ్ సెంచరీలతో 1100లకు పైగా పరుగులు చేయగలిగాడు...
210
అయితే ఐపీఎల్‌లో మాత్రం రాబిన్ ఊతప్పకు చాలా మెరుగైన రికార్డు ఉంది. ఐపీఎల్ 2008 నుంచి 15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు...
310
ఐపీఎల్ కెరీర్‌లో 194 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 27.94 సగటుతో 4800 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో 8వ స్థానంలో ఉన్నాడు ఊతప్ప...
410
రాబిన్ ఊతప్పకి ఐపీఎల్‌లో 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 464 ఫోర్లు బాదిన ఊతప్ప, 171 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ 2014 సీజన్‌లో 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కూడా గెలిచాడు ఊతప్ప...
510
ఐపీఎల్‌లో ఓపెనర్‌గా రాబిన్ ఊతప్పకి చాలా మెరుగైన రికార్డు ఉంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చాడు ఊతప్ప...
610
27 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప... మెరుపు హాఫ్ సెంచరీతో పవర్ ప్లేలో ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది సీఎస్‌కే...
710
ఓవరాల్‌గా పవర్ ప్లేలో సీఎస్‌కేకి ఇది నాలుగో అత్యధిక స్కోరు. పవర్ ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేసిన నాలుగో క్రికెటర్ రాబిన్ ఊతప్ప. ఇంతకుముందు సురేష్ రైనా 87, డ్వేన్ స్మిత్ 50 పరుగులు చేయగా, కేకేఆర్‌పై రైనా 47 పరుగులు చేశాడు.
810
పవర్ ప్లే ముగిసే సమయానికి 45 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, 185+ స్ట్రైయిక్ రేటుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
910
ఈ ఇన్నింగ్స్‌తో రాబిన్ ఊతప్పలాంటి ఓపెనర్‌ని టీమిండియా సరిగా ఉపయోగించుకోలేకపోయిందా? అనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది...
1010
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలల్లాగే రాబిన్ ఊతప్పకి కూడా సరైన అవకాశాలు ఇచ్చి ఉంటే... ఇప్పటికి టీమిండియా లెజెండరీ ప్లేయర్లలో లిస్టులో అతనికి చోటు దక్కేదని ఐపీఎల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..