ఐపీఎల్‌లో తెలుగు కుర్రాళ్లకు అవకాశాలు రావడమే చాలా తక్కువ. లోకల్ పాలిటిక్స్ కారణంగా ఎంతో సత్తా ఉన్నా, చాలామంది తెలుగు క్రికెటర్లు, దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకోలేకపోతున్నారు. తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్, ఎన్నో ఏళ్లుగా టీమ్‌లో చోటు కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే...
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దాదాపు 4 వేల పరుగులు చేసి, లిస్ట్ ఏ క్రికెట్‌లో 1281 పరుగులు చేసిన కోన శ్రీకర్ భరత్, భారత జట్టుకి రిజర్వు ప్లేయర్‌గా ఎంపికవుతున్నా... తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు.
210
రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్ వంటి క్రికెటర్లు... ఐపీఎల్‌లో అవకాశాలు రావడంతో తమ సత్తా నిరూపించుకుని భారత జట్టులోకి వికెట్ కీపర్ బ్యాటర్లుగా ఎంట్రీ ఇచ్చారు...
310
srikar bharat
కోన శ్రీకర్ భరత్‌కి మాత్రం ఈ విషయంలోనూ అన్యాయం జరుగుతోంది. 2015 నుంచి ఐపీఎల్‌కి రిజిస్టర్ చేయించుకుంటున్న శ్రీకర్ భరత్, 2021 సీజన్ దాకా ఒక్క అవకాశాన్ని కూడా దక్కించుకోలేకపోయాడు...
410
ఆర్‌సీబీ పుణ్యమాని ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీకర్ భరత్, 8 మ్యాచుల్లో 38.20 సగటుతో 191 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది...
510
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, ఆఖరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించి... క్రికెట్ ఫ్యాన్స్ అటెన్షన్ దక్కించుకున్నాడు...
610
అయితే ఐపీఎల్ 2021 టోర్నీ పర్ఫామెన్స్ తర్వాత కూడా ఈ సీజన్‌లో శ్రీకర్ భరత్‌కి తుదిజట్టులో అవకాశం దక్కడం అనుమానంగానే మారింది...
710
ఐపీఎల్ 2022 మెగా వేలంలో కెఎస్ భరత్‌ని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ సారథి రిషబ్ పంత్ ఉన్నంతవరకూ కెఎస్ భరత్‌కి తుదిజట్టులో అవకాశం దక్కడం చాలా రేర్...
810
టీమ్‌లో ఏ ప్లేయర్ అయినా గాయపడితే, లేదా మరీ ఘోరంగా విఫలమవుతూ ఉంటే... రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయలేకపోతే... భరత్‌కి తుదిజట్టులో అవకాశం వస్తుంది...
910
ఐపీఎల్ 2021 టోర్నీలో శ్రీకర్ భరత్ ఆటతీరు చూసిన రిషబ్ పంత్, తనకు పోటీ వస్తాడనే ఉద్దేశంతో అతన్ని కొనుగోలు చేసి రిజర్వు బెంచ్‌కి పరిమితం చేసి ఉంటాడని అంటున్నారు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్...
1010
లేకలేక గత సీజన్‌లో అవకాశం వచ్చి, నిరూపించుకోవడంతో తన కెరీర్ గ్రాఫ్ మారిపోతుందని ఆశపడిన శ్రీకర్ భరత్‌కి మరోసారి రిజర్వు ప్లేయర్‌గా మారడంతో నిరాశే ఎదురైంది..