పోటీయే లేదు, శ్రేయాస్ అయ్యరే టీమిండియా నెక్ట్స్ కెప్టెన్... ఆర్‌సీబీతో మ్యాచ్ తర్వాత...

Published : Mar 31, 2022, 07:54 PM IST

టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత చాలామందిని వెంటాడుతున్న ప్రశ్న ఇదే. టీమిండియా సారథిగా రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో బాధ్యతలు తీసుకున్నా, ఆయన మరెంతోకాలం క్రికెట్‌ ఆడడనేది అందరికీ తెలిసిన విషయమే...

PREV
111
పోటీయే లేదు, శ్రేయాస్ అయ్యరే టీమిండియా నెక్ట్స్ కెప్టెన్... ఆర్‌సీబీతో మ్యాచ్ తర్వాత...

రోహిత్ శర్మకు కెప్టెన్‌గా బాధ్యతలు ఇచ్చినప్పుడే వైస్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌ని నియమించిన బీసీసీఐ... టీమిండియా తర్వాతి సారథి అతనే అనే సంకేతాలు ఇచ్చింది...

211

అయితే సౌతాఫ్రికా టూర్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు కెఎల్ రాహుల్. పరాజయాలు వచ్చినా పర్లేదు కానీ కెప్టెన్‌గా విజయం దక్కించుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు రచించడంలో రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

311

స్టార్ ప్లేయర్లు, వరల్డ్ క్లాస్ క్రికెటర్లు టీమ్‌లో ఉన్నా, వారిని ఎలా వాడాలో కెఎల్ రాహుల్‌కి తెలియలేదు. అందుకే కెఎల్ రాహుల్‌ని భావి సారథిగా చూడలేకపోతున్నారు టీమిండియా ఫ్యాన్స్...

411

రిషబ్ పంత్‌, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రాలు కూడా కెఎల్ రాహుల్‌తో కలిసి టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ఉన్నారు. అయితే వీరిలో అయ్యర్, అందరి కంటే ముందుండేవాడు...

511

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను మొట్టమొదటిసారి ఫైనల్ చేర్చి, ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదించిన శ్రేయాస్ అయ్యర్, గాయం కారణంగా నాలుగు నెలలు క్రికెట్‌కి దూరమై, కెప్టెన్సీ రేసులో వెనకబడ్డాడు..

611

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయాస్ అయ్యర్, మొదటి రెండు మ్యాచుల్లో తన కెప్టెన్సీతో విమర్శకులను కూడా మెప్పించాడు... ముఖ్యంగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్ అయితే వేరే లెవెల్...

711

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు ఉన్న ఆర్‌సీబీ, 129 పరుగుల టార్గెట్‌ని ఈజీగా ఛేదిస్తుందని అనుకున్నారంతా.

811

అయితే కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కారణంగా ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు 20వ ఓవర్ దాకా వేచి చూడాల్సి వచ్చింది ఆర్‌సీబీ. చివర్లో దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్ మెరుపుల కారణంగా ఆర్‌సీబీ గెలిచింది కానీ ఒక్క వికెట్ పడి ఉంటే, మ్యాచ్ రిజల్టే మారిపోయేది...

911

14, 15,17వ ఓవర్లలో కేవలం నాలుగేసి పరుగులే ఇచ్చిన కేకేఆర్ బౌలర్లు, 18వ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే సమర్పించి రెండు వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ మారింది...

1011

టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్ వంటి బౌలర్లను శ్రేయాస్ అయ్యర్ వాడిన విధానం... టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని గుర్తుకుతెచ్చింది...

1111

ఈ మ్యాచ్‌తో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే మిగిలాడని... కెఎల్ రాహుల్ వంటి కెప్టెన్సీ స్పెల్లింగ్ కూడా రానివాళ్లు ఈ రేసులో లేరని అంటున్నారు ఫ్యాన్స్... 

Read more Photos on
click me!

Recommended Stories