ఒంటిమీద నుంచి నయాగరా కారిపోతోంది, శివమ్ దూబే వేసిన ఆ ఓవర్‌లో...

Published : Apr 01, 2022, 04:01 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ ఆరంభం నుంచి క్రికెట్ ఫ్యాన్స్‌కి ఊర్రూతలూగించే మజా దొరుకుతోంది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లన్నీ (ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మినహా) నువ్వా నేనా అన్నట్టుగా ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగాయి...

PREV
110
ఒంటిమీద నుంచి నయాగరా కారిపోతోంది, శివమ్ దూబే వేసిన ఆ ఓవర్‌లో...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 205 పరుగుల భారీ టార్గెట్‌ను కాపాడుకోలేక ఓటమి పాలైతే, సీఎస్‌కే అంతకంటే ఆరు పరుగులు ఎక్కువే చేసింది...

210

211 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా తొలి రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది...
 

310

ఆఖరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్‌లో శివమ్ దూబే వేసిన 19వ ఓవర్, లక్నో సూపర్ జెయింట్స్‌కి భారీ లక్ష్యఛేదనను ఈజీగా మార్చేసింది... 
 

410

19వ ఓవర్ మొదటి బంతికే ఆయుష్ బదోనీ సిక్సర్ బాదడంతో శివమ్ దూబే కాస్త ఒత్తిడికి లోనయ్యారు. ఆ తర్వాత వరుసగా రెండు వైడ్లు వేసిన దూబే, రెండో బంతికి సింగిల్ మాత్రమే ఇచ్చాడు..
 

510

మూడో బంతికి 2 పరుగులు తీసిన ఇవిన్ లూయిస్, ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మొత్తంగా 25 పరుగులు రాబట్టాడు...

610

ఈ ఓవర్‌కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు కావాలి. అయితే ఈ ఓవర్ తర్వాత అది కాస్తా 6 బంతుల్లో 9 పరుగులు కావాల్సినంత ఈజీగా మారిపోయింది...

710

‘ఇక్కడ ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది. ఒంటిమీద నుంచి చెమట నయాగరా ఫాల్స్‌లా కారిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్పిన్ బౌలింగ్‌ వేయించలేం... 

810

అందుకే స్పిన్ బౌలర్‌ని కాకుండా శివమ్ దూబేతో బౌలింగ్ చేయించాలని భావించాం. దాన్ని వాళ్లు అడ్వాంటేజ్‌గా మలుచుకున్నారు. ఒక్క ఓవర్‌లో ఏమైపోతుందులే అనుకున్నాం...
 

910

కానీ ఆ ఒక్క మ్యాచ్‌లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయడంలో లక్నో బ్యాటర్లు సక్సెస్ అయ్యారు. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన ఆరంభాన్ని వాళ్లు కరెక్టుగా నిర్మించుకున్నారు...
 

1010

ఆడమ్ మిల్నేకి గాయమైంది. అతను కోలుకుంటున్నాడు. క్రిస్ జోర్డాన్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తాడు. దీపక్ చాహార్ కూడా త్వరలో టీమ్2లోకి వస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్.. 

click me!

Recommended Stories