IPL 2022: కెప్టెన్సీ నుంచి వైదొలిగినా సారథ్య బాధ్యతలు చూస్తున్న ధోని.. మరి జడ్డూ ఏం చేస్తున్నట్టు..?

Published : Apr 01, 2022, 01:56 PM IST

TATA IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్ కు కొద్దిరోజుల ముందు రవీంద్ర చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోని.. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.  ఈ సీజన్ లో కెప్టెన్సీ పగ్గాలను జడేజాకు అప్పగించాడు. 

PREV
18
IPL 2022: కెప్టెన్సీ నుంచి వైదొలిగినా సారథ్య బాధ్యతలు చూస్తున్న ధోని.. మరి జడ్డూ ఏం చేస్తున్నట్టు..?

సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగినా ధోనికి మాత్రం ఆ లక్షణాలు ఇంకా పోయినట్టు లేదు. గ్రౌండ్ లో ఆ జట్టు ప్రస్తుత సారథి రవీంద్ర జడేజా ఉన్న అతడి పాత్ర నామమాత్రమే అయినట్టుంది. ఏదో ఉన్నావా..? అంటే ఉన్నా అనే తీరుగా రవీంద్ర జడేజా వ్యవహరిస్తున్నట్టుంది. 

28

2008 నుంచి ఐపీఎల్ లో చెన్నైకి సారథిగా వ్యవహరించిన ధోని.. ఉన్నట్టుండి ఈ సీజన్ కు ముందు ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.  కెప్టెన్సీ పగ్గాలను రవీంద్ర జడేజాకు అప్పగించిన విషయం తెలిసిందే. 

38

అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ధోని మాత్రం ఇంకా ఆ  బాధ్యతలను మాత్రం మరిచినట్టు లేదు. లక్నోత సూపర్ జెయింట్స్ మ్యాచులో ఈ విషయం స్పష్టమైంది.  జడేజా ఫీల్డ్ లో ఉన్నా ధోనినే కెప్టెన్సీ వ్యవహరాలు చూసుకున్నాడు. 

48

ప్రతీ ఓవర్ కు ఫీల్డర్లను మార్చడం.. బ్యాటర్లకు తగ్గట్టుగా ఫీల్డింగ్ సెట్ చేయడం వంటివన్నీ సాధారణంగా  సారథులు చేసే పనులు. కానీ గురువారం లక్నోత జరిగిన మ్యాచులో ఇవన్నీ ధోనినే చేశాడు.  

58

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దీంతో చెన్నైకి సారథి రవీంద్ర జడేజానా..? లేక ఇంకా అనధికారికంగా ధోనినే కొనసాగుతున్నాడా..? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

68

కాగా ఐపీఎల్  ప్రారంభ మ్యాచ్ (కేకేఆర్) తో పాటు గురువారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా సీఎస్కే ఓటమి పాలైంది. కేకేఆర్ తో తక్కువ స్కోరుకే పరిమితమై ఓడిన చెన్నై.. ఈసారి భారీ స్కోరు చేసినా ఓటమి తప్పలేదు. 

78

గురువారం నాటి  మ్యాచులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.  అనంతరం లక్ష్య ఛేదనలో  లక్నో.. 19.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఇది ఆ జట్టుకు తొలి విజయం కాగా.. చెన్నైకి వరుసగా రెండో పరాజయం. 

88

ఇదిలాఉండగా.. ఈ మ్యాచులో  6 బంతుల్లోనే ఓ సిక్సర్ రెండు ఫోర్ల సాయంతో ధోని 16 పరుగులు సాధించాడు. తద్వారా టీ20 ఫార్మాట్ లో 7 వేల పరుగులు   పూర్తి చేసిన ఐదో భారత క్రికెటర్ అయ్యాడు. తొలి నాలుగు స్థానాల్లో విరాట్ కోహ్లి,  రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్ప, శిఖర్ ధావన్ లు ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories