ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యంగ్ బ్యాటర్ ఆయష్ బదోనీ. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో సీనియర్లు కెఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, మనీశ్ పాండే, లూయిస్ ఫెయిలైన చోట... హాఫ్ సెంచరీతో లక్నోకి మంచి స్కోరు అందించాడు బదోనీ...
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడాతో కలిసి ఐదో వికెట్‌కి 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఆయుష్ బదోనీ... 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు...
28
మొదటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినా తన జట్టును గెలిపించలేకపోయిన ఆయుష్ బదోనీ, రెండో మ్యాచ్‌లో ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు...
38
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 211 పరుగుల భారీ టార్గెట్‌ని ఊదేసింది లక్నో సూపర్ జెయింట్స్. విజయానికి 16 బంతుల్లో 40 పరుగులు కావాల్సిన దశలో క్రీజులోకి వచ్చాడు ఆయుష్ బదోనీ...
48
9 బంతుల్లో 2 భారీ సిక్సర్లతో 19 పరుగులు చేసిన బదోనీ, వార్ వన్‌సైడ్ చేసేశాడు. 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసిన ఇవిన్ లూయిజ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు...
58
అయితే విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు కావాల్సిన దశలో ఆయుష్ బదోనీ, శివమ్ దూబే బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టాడు. బదోనీ కొట్టిన సిక్సర్ కారణంగా స్టాండ్స్‌లో మ్యాచ్ చూస్తున్న ఓ మహిళ గాయపడింది...
68
ఆయుష్ బదోనీ కొట్టిన సిక్సర్‌ను క్యాచ్ పట్టుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడంతో అది అతని చేతిని తాకి మహిళ తలను గాయపరిచింది. ఆమెకు సాయం చేసేందుకు కొందరు ముందుకు రాగా, తాను బాగానే ఉన్నానని చెప్పిందా మహిళ...
78
Ayush Badoni
కరోనా నిబంధనల కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచులను చూసేందుకు 25 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతిస్తోంది బీసీసీఐ..
88
ఐపీఎల్ ఆరంభానికి ముందు శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ రెండో టెస్టులో రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్ కారణంగా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఓ అభిమాని ముక్కు పగిలిన విషయం తెలిసిందే...