ఓడితే ఓడాం కానీ అతన్ని ఊరికే టీమ్‌లో ఇరికించలేం... రాజ్‌వర్థన్ హంగర్కేకర్‌పై సీఎస్‌కే కోచ్...

First Published Apr 29, 2022, 6:22 PM IST

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ అయినా యువ క్రికెటర్లను ఆడించడానికి ఇష్టపడుతుందేమో కానీ చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళితే ఆ యంగ్‌స్టర్‌కి తుదిజట్టులో అవకాశం రావాలంటే సీజన్ల పాటు వెయిట్ చేయాల్సిందే.  ఏదో లక్కీగా రుతురాజ్ గైక్వాడ్ తుదిజట్టులోకి వచ్చాడు కానీ సీఎస్‌కే తరుపున ఎంట్రీ ఇచ్చి, అదరగొట్టిన ప్లేయర్ల సంఖ్య చాలా చాలా తక్కువ...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 8 మ్యాచుల్లో 2 విజయాలు మాత్రమే అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, అరడజను అపజయాలు అందుకుంది.. జడ్డూతో సహా చాలామంది ప్లేయర్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు...

అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీ ద్వారా అదరగొట్టిన ఆల్‌రౌండర్ రాజ్‌వర్థన్ హంగర్కేకర్‌ను మెగా వేలంలో కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... అయితే రాజ్‌వర్థన్‌కి ఇప్పటిదాకా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు సీఎస్‌కే...

Latest Videos


‘ఏ ప్లేయర్‌ని అయినా అంత ఈజీగా అలా టీమ్‌లోకి పంపించలేం. ఎందుకంటే అతను అండర్ 19 లెవెల్‌లో ఆకట్టుకున్నాడు. కానీ ఇది వేరు, ఈ స్టేజ్ వేరు... 

అతని స్కిల్స్ విషయంలో మేం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని అనుకుంటున్నాం. అతను ఇంకొన్నాళ్లు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది... లేదంటే మొదటికే మోసం వస్తుంది...

అతను శక్తి సామర్థ్యాలు ఏంటో అతనికి నమ్మకం వచ్చిన తర్వాతే బరిలో దించుతాం... ’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్...

పంజాబ్ కింగ్స్ నుంచి అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రాజస్థాన్ రాయల్స్ నుంచి ఛేతన్ సకారియా, కేకేఆర్ నుంచి వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ, శివమ్ మావి వంటి యంగ్ గన్స్... వెలుగులోకి వచ్చారు...

అలాగే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ నుంచి డేవాల్డ్ బ్రేవిస్, తిలక్ వర్మ వంటి యువ క్రికెటర్లు... క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు...

అలాంటిది చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం రుతురాజ్ గైక్వాడ్‌కి తప్ప మరో యంగ్ ప్లేయర్‌ను వరుస అవకాశాలు ప్రోత్సహించింది లేదు. ఈసారి దీపక్ చాహార్ గాయంతో తప్పుకోవడంతో ముఖేశ్ చౌదరి, సీఎస్‌కేకి మెయిన్ బౌలర్‌గా మారాడు...

click me!