విరాట్ బుర్రలో ఏం తిరుగుతుందో తెలీదు కానీ... ఆ ఇద్దరూ ఫామ్‌లోకి వస్తారు... సౌరవ్ గంగూలీ కామెంట్...

Published : Apr 29, 2022, 04:18 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియాలో చాలా రాజకీయాలే జరిగాయి. ఐదు నెలల కాలంలో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. అదే ప్రభావం కోహ్లీ బ్యాటింగ్‌పై తీవ్రంగా పడింది...

PREV
19
విరాట్ బుర్రలో ఏం తిరుగుతుందో తెలీదు కానీ... ఆ ఇద్దరూ ఫామ్‌లోకి వస్తారు... సౌరవ్ గంగూలీ కామెంట్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా తన మార్క్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. రెండు సార్లు రనౌట్, మరో రెండు సార్లు డకౌట్.. ఇంకో రెండుసార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు...

29

విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్‌కి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, అతనితో వ్యవహరించిన విధానమే కారణమని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి..

39

అలాగే టీమిండియాకి మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ 2022 సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు... బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గానూ ఫెయిల్ అవుతున్నాడు.

49

ఐపీఎల్‌లో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, వరుసగా 8 మ్యాచుల్లో ఓడి చెత్త రికార్డును మూటకట్టుకుంది. 

59

టీమిండియా కెప్టెన్సీ భారం కారణంగానే రోహిత్, ఐపీఎల్‌లోనూ టీమ్‌ని సరిగా నడిపించలేకపోతున్నాడని మరోసారి ఇక్కడ కూడా దాదానే టార్గెట్ చేస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్..

69

‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా గొప్ప ప్లేయర్లు. వాళ్లు ఇలాంటి పరిస్థితులను ఇంతకుముందు కూడా ఎదుర్కొన్నారు, కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈసారి కూడా వాళ్లు ఫామ్‌లోకి వస్తారు...

79

త్వరలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటు నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వస్తాయని అనుకుంటున్నా. విరాట్ కోహ్లీ ఏం ఆలోచిస్తున్నాడో, అతని బుర్రలో ఏ ఆలోచనలు తిరుగుతున్నాయో నాకైతే తెలీదు...

89

అయితే అతను త్వరలోనే ఫామ్‌లోకి వచ్చి, ఇంతకుముందులా మంచి పరుగులు చేస్తాడనే నమ్మకం ఉంది. అతను ఓ గొప్ప క్రికెటర్.. ’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

99

కరోనా కేసులు పెరగకపోతే ఐపీఎల్‌లో బయో బబుల్ నిబంధనను తొలగించే ఆలోచనలో ఉన్నామని తెలిపిన గంగూలీ, ప్లేఆఫ్స్ మ్యాచులను 100 శాతం ప్రేక్షకుల మధ్య నిర్వహించబోతున్నట్టు తెలియచేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories