సంజూ శాంసన్‌తో వచ్చిన చిక్కు ఇదే, బాగా ఆడతాడు కానీ... రవిశాస్త్రి కామెంట్...

First Published May 25, 2022, 5:46 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొట్టిన కెప్టెన్లలో సంజూ శాంసన్ కూడా ఒకడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ని ప్లేఆఫ్స్‌ చేర్చిన సంజూ శాంసన్, బ్యాటర్‌గానూ రాణించి 400+ పరుగులు చేశాడు. అయితే సంజూ శాంసన్‌కి సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో చోటు దక్కలేదు...

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో 150+ స్ట్రైయిక్‌ రేటుతో 400లకు పైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు...

Sanju Samson

అయితే రాహుల్ త్రిపాఠికి కానీ సంజూ శాంసన్‌కి కానీ సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు. అప్పుడెప్పుడో 2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, ఇప్పటిదాకా ఆడింది 13 టీ20 మ్యాచులే...

Sanju Samson

ఎమ్మెస్ ధోనీ కారణంగా సంజూ శాంసన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ జట్టులోకి వచ్చి పోతూ ఉండేవాళ్లు. మాహీ రిటైర్మెంట్ తర్వాత రిషబ్ పంత్ ఆ ప్లేస్‌ని ఆక్రమించుకోవడంతో సంజూ శాంసన్‌కి ఎక్కువగా అవకాశాలు రావడం లేదు...

రిషబ్ పంత్‌తో పాటు రెండో వికెట్ కీపర్‌గా సీనియర్ సంజూ శాంసన్ కంటే ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌కి ఎక్కువ అవకాశాలు వస్తుండడం విశేషం...

Sanju Samson

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్‌లో యశస్వి జైస్వాల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదాడు...

26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన సంజూ శాంసన్, భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకోవాలని ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
 

Ravi Shastri, Sanju Samson

‘సంజూ శాంసన్‌తో వచ్చిన చిక్కు ఇదే. అతను ఆల్‌రౌండ్ గేమర్. లైన్ మీద వచ్చిన బంతులను నేరుగా సిక్సర్లుగా మలచగలడు. భారీ సిక్సర్లు కొట్టి బంతిని స్టేడియం బయట పడేయగలడు...

షార్ట్ బంతులు వస్తే చాలు వాటిని పుల్ చేయడానికి సంజూ శాంసన్ రెఢీగా ఉంటాడు. స్పిన్నర్ల విషయంలో మాత్రం సంజూ శాంసన్ కాస్త ఆగి ఆగతాడు... అయితే అతన్ని ఎక్కువ సేపు సైలెంట్‌గా ఉంచలేం...

Sanju Samson

అతను కొన్ని చూడచక్కని షాట్లు ఆడాడు. సంజూ శాంసన్ ఆడింది టాప్ క్లాస్ ఇన్నింగ్స్. అయితే అతను ఒక్క మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్ ఆడడు. తక్కువ స్కోరుకే అవుటై పోతాడు... 

నిలకడలేమి కారణంగానే భారత జట్టులో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు... బట్లర్ ఓ ఎండ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్న సమయంలో మరో ఎండ్‌లో బౌండరీలతో డీల్ చేసిన శాంసన్ టాలెంట్‌ని మాత్రం తక్కువ చేయలేం...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

click me!