Australia Vs Pakistan: ఆస్ట్రేలియా వెటరన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించాడు. పాక్ తో లాహోర్ టెస్టు సందర్భంగా స్మిత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించాడు. పాకిస్థాన్ తో లాహోర్ లో జరుగుతున్న మూడో టెస్టులో వ్యక్తిగత స్కోరు 12 వద్దకు చేరుకోగానే టెస్టులలో వేగంగా 8వేల పరుగులు చేసిన క్రికెటర్ గా అరుదైన ఘనత సాధించాడు.
27
151 ఇన్నింగ్సులలోనే స్మిత్ ఈ రికార్డును సాధించాడు. దీంతో 152 ఇన్నింగ్సులలో గతంలో ఈ ఫీట్ సాధించిన శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర రికార్డును అధిగమించాడు.
37
టెస్టు క్రికెట్ చరిత్రలో వేగంగా 8వేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో ఇన్నాళ్లు కుమార సంగక్కర (91 టెస్టులు.. 152 ఇన్నింగ్సులలో) ఈ ఘనతను సాధించాడు.
47
అంతకంటే ముందు విండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ (91 టెస్టులు 157 ఇన్నింగ్సులలో), రాహుల్ ద్రావిడ్ (94 టెస్టులు, 158 ఇన్నింగ్సులలో), సచిన్ టెండూల్కర్ (96 టెస్టులు, 154 ఇన్నింగ్సులు) లు ఈ ఫీట్ ను సాధించారు.
57
ఇక ఆస్ట్రేలియా తరఫున టెస్టులలో 8వే పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా స్మిత్ చేరాడు. గతంలో అలెన్ బోర్డర్ (184 ఇన్నింగ్సులు), స్టీవ్ వా (194 ఇన్నింగ్సులు), మైఖెల్ క్లార్క్ (172 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్ (165 ఇన్నింగ్స్) లు స్మిత్ కంటే ముందున్నారు.
67
కాగా తన టెస్టు కెరీర్ లో ఏడు వేల పరుగుల మైలురాయిని కూడా స్మిత్ పాకిస్థాన్ మీదే చేయడం గమనార్హం. 2019 లో స్వదేశంలో టెస్టు సిరీస్ సందర్భంగా పాక్ మీద ఈ మైలురాయిని పూర్తి చేసుకున్నాడు.
77
ఇక తన కెరీర్ లో స్మిత్.. 85 టెస్టులలో 8,010 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 239 గా ఉంది.