ఆర్‌సీబీ కోచ్‌గా ఏబీ డివిల్లియర్స్... విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ 2022 సీజన్‌లో...

Published : Dec 05, 2021, 09:47 AM IST

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, ఆర్‌సీబీ కీ ప్లేయర్ ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్, ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ని తీవ్రంగా కలిచివేసింది...

PREV
110
ఆర్‌సీబీ కోచ్‌గా ఏబీ డివిల్లియర్స్... విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ 2022 సీజన్‌లో...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కీ ప్లేయర్‌గా ఎన్నో మ్యాచుల్లో విజయాలు అందించిన ఏబీ డివిల్లియర్స్... లేకపోతే ఆర్‌సీబీ, ఆర్‌సీబీలా అనిపించదు... ఏదో వెలితి ఉన్నట్టుగానే ఉంటుంది...

210

5 వేలకు పైగా పరుగులు, 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు, 151.68 సగటుతో ఆర్‌సీబీలో కీ ప్లేయర్‌గా, కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆత్మీయ మిత్రుడిగా ఉన్న ఏబీ డివిల్లియర్స్, వచ్చే సీజన్‌లో కనిపించడనే ఆలోచన కూడా ఫ్యాన్స్‌ను ఇబ్బందిపెడుతోంది...

310

అందుకే ఎలాగైనా ఏబీ డివిల్లియర్స్‌ను తిరిగి ఆర్‌సీబీలో చేర్చేందుకు మార్గాలు కనుక్కుంటోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మేనేజ్‌మెంట్...

410

ఇప్పటికే ఆర్‌సీబీ కోచింగ్‌ స్టాఫ్‌లో ఏబీ డివిల్లియర్స్‌ను చేర్చాలని ప్రయత్నాలు ప్రారంభించింది ఆర్‌సీబీ. ఏబీడీని బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా తీసుకురావాలని ప్రయత్రిస్తోంది రాయల్ ఛాలెంజర్స్..

510

ఈ విషయాన్ని స్వయంగా ఆర్‌సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ తెలియచేశాడు. ‘ఏబీ డివిల్లియర్స్‌ను జట్టులో తిరిగి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాటింగ్ కోచ్‌గా లేదా కన్సల్టెంట్ కోచ్‌గా ఏబీడీని తిరిగి ఆర్‌సీబీకి తీసుకొస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు సంజయ్ బంగర్...

610

ఏబీ డివిల్లియర్స్ ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో ఆయనకు చోటు దక్కలేదు...

710

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లతో పాటు మహ్మద్ సిరాజ్‌ను అట్టిపెట్టుకుంటున్నట్టు ప్రకటించింది ఆర్‌సీబీ...

810

విరాట్ కోహ్లీ కూడా ఆర్‌సీబీ కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో వచ్చే సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్‌గా వ్యవహరించేది ఎవరు? వికెట్ కీపర్ ఎవరు? అనే విషయాల్లో సస్పెన్స్ నెలకొంది...

910

గత సీజన్‌లో ఆర్‌సీబీ ద్వారా ఆరంగ్రేటం చేసిన తెలుగు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోన శ్రీకర్ భరత్‌ను తిరిగి మెగా వేలంలో కొనుగోలు చేసేందుకు విరాట్ టీమ్ ప్రయత్నించవచ్చు...
 

1010

గ్లెన్ మ్యాక్స్‌‌వెల్‌కి కెప్టెన్సీ దక్కొచ్చని ప్రచారం జరుగుతున్నా, నిలకడగా పరుగులు చేయని అతన్ని కెప్టెన్‌గా నియమించే సాహసం ఆర్‌సీబీ చేయకపోచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories