దయచేసి ఏ భారతీయుడిని దేశం విడిచి వెళ్లనివ్వకండి... అజాజ్ పటేల్ 10 వికెట్ల ఫీట్‌పై ఇర్ఫాన్ పఠాన్...

First Published Dec 4, 2021, 1:53 PM IST

ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఎక్కడో ఏదో సాధిస్తే... సాటి భారతీయుడని గర్వపడతాం. అదే ఇక్కడ పుట్టి, ఎక్కడో పెరిగి... ఇక్కడికొచ్చి, మనపైనే 10కి 10 వికెట్లు తీస్తే... ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఇప్పుడు టీమిండియా పరిస్థితి అదే. భారత్‌లో పుట్టిన అజాజ్ పటేల్, న్యూజిలాండ్‌కి వలసెళ్లి, ఇప్పుడు భారత్‌పైనే అద్భుత రికార్డు క్రియేట్ చేశాడు..

భారత్‌ నుంచి వలస వెళ్లి, అమెరికాలో సెటిల్ అయ్యి, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్‌కి సీఈవోగా ఎంపికైన పరాగ్ అగర్వాల్‌ను చూసి, యావత్ భారతం గర్వించింది...

అలాగే భారత్‌లో జన్మించి, 8 ఏళ్ల వయసులో న్యూజిలాండ్‌కి వలస వెళ్లి... 25 ఏళ్ల తర్వాత కివీస్ క్రికెటర్‌గా తిరిగి వచ్చి, భారత జట్టుపైనే 10కి 10 వికెట్లు తీశాడు అజాజ్ పటేల్...

శుబ్‌మన్ గిల్‌తో మొదలైన అజాజ్ పటేల్ మ్యాజిక్, 10వ వికెట్‌‌గా మహ్మద్ సిరాజ్‌ను పెవిలియన్ చేర్చే వరకూ సాగింది. భారత జట్టుపై అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన ప్రత్యర్థి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అజాజ్ పటేల్..

జిమ్ లాకర్ 1956లో ఆస్ట్రేలియాపై, అనిల్ కుంబ్లే 1999లో పాకిస్తాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీస్తే... భారత్‌పై ఈ ఫీట్ సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు అజాజ్ పటేల్...

జిమ్ లాకర్, అనిల్ కుంబ్లే సొంత గడ్డపై ఈ ఫీట్ సాధిస్తే... న్యూజిలాండ్‌ తరుపున ఆడుతున్న అజాజ్ పటేల్, పర్యాటన దేశంలో 10కి 10 వికెట్లను తీసిన మొట్టమొదటి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు...

‘దయచేసి ఏ భారతీయుడిని దేశం విడిచి, వేరే దేశానికి వెళ్లనివ్వకండి. బెస్ట్, వాళ్లని ఎక్కడ పుట్టారని అడగకండి... దస్ కా దమ్... ’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్పాన్ పఠాన్...

పాకిస్తాన్‌పై 22 ఏళ్ల కిందట ఈ ఫీట్ సాధించిన అనిల్ కుంబ్లే, అజాజ్ పటేల్‌కి అభినందనలు తెలిపాడు. ‘వెల్‌కమ్ టూ ది క్లబ్ అజాజ్ పటేల్. పర్ఫెక్ట్ 10. చాలా బాగా బౌలింగ్ చేశాడు. మొదటి రెండు రోజుల్లో ఈ ఫీట్ సాధించడానికి చాలా ప్రత్యేకమైన కృషి చేయాలి...’ అంటూ ట్వీట్ చేశాడు అనిల్ కుంబ్లే..

టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా అజాజ్ పటేల్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ‘సెన్సేషనల్... జస్ట్ సెన్సేషనల్. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడమంటే ఏ బౌలర్‌కైనా కల నెరవేరినట్టే. అభినందనలు, అజాజ్ పటేల్. నువ్వు ఇప్పుడు చాలా అరుదైన బౌలర్ జాబితాలో జిమ్ లాకర్, అనిల్ కుంబ్లేలతో చేరావు... నువ్వు పుట్టిన నగరంలో ఈ ఫీట్ సాధించడం మరీ స్పెషల్’ అంటూ ట్వీట్ చేశాడు వీవీఎస్ లక్ష్మణ్...

click me!