Shikhar Dhawan: గబ్బర్ బాలీవుడ్ ఎంట్రీ.. షూటింగ్ కూడా కంప్లీట్.. ఆ సినిమానేనా..?

Published : May 17, 2022, 04:58 PM IST

Shikhar Dhawan Bollywood Debut: టీమిండియా అభిమానులు ప్రేమగా గబ్బర్ అని పిలుచుకునే  ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలోనే  వెండితెరపై మెరువనున్నాడు.  

PREV
18
Shikhar Dhawan: గబ్బర్ బాలీవుడ్ ఎంట్రీ.. షూటింగ్ కూడా కంప్లీట్.. ఆ సినిమానేనా..?

టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్   పుణ్యమా అని క్రికెటర్లు కూడా తమలో దాగి ఉన్న నటనా ప్రతిభను బయటకు తీస్తున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచే పేరు శిఖర్ ధావన్. 

28

టీమిండియా అభిమానులు ప్రేమగా గబ్బర్ (అమితాబ్ బచ్చన్ నటించిన షోలే సినిమాలో గబ్బర్ సింగ్ పాత్రధారి పేరు) అని పిలుచుకునే శిఖర్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని బీ టౌన్ వర్గాల టాక్. 
 

38

ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ గబ్బర్.. ఇప్పటికే ఓ బాలీవుడ్ సినిమాకు సైన్ చేయడం.. అందులో నటించడం.. తన పాత్రకు డబ్బింగ్  చెప్పుకోవడం కూడా అయిపోయిందట. అయితే ఇవేవీ ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. 

48

కానీ తాజాగా ప్రముఖ సినిమా వెబ్సైట్  పింక్ విల్లా సమాచారం ప్రకారం.. ధావన్ కు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ... ‘శిఖర్ కు నటులంటే ఎనలేని గౌరవం ఉంటుంది.  అతడికి సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషించాడు.. 

58

ఈ క్యారెక్టర్ కు ధావన్ సరిపోతాడని దర్శక నిర్మాతలు భావించడంతో  అతడు కూడా  ఈ పాత్ర చేయడానికి కాదనలేకపోయాడు. కొన్ని నెలల క్రితమే  ధావన్ ను కలిసి కథ వినిపించిన దర్శక నిర్మాతలు అతడికి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కూడా ఇటీవలే పూర్తి చేశారు. 

68

ఈ సినిమాలో ధావన్ ది సినిమా మొత్తం ఉండే కీలక పాత్ర. ఏదో అతిథి పాత్రలా రెండు నిమిషాలు ఉండే మాయమయ్యే క్యారెక్టర్ కాదు.  సినిమాలో చాలా కీలక పాత్ర. అందుకే ధావన్ కూడా చేయడానికి ఒప్పుకున్నాడు.  ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశముంది..’ అని తెలిపాడు. 

78

అయితే ధావన్ నటిస్తున్న సినిమా పేరేమిటి..? అందులో దర్శకుడు ఎవరు.?? హీరో ఎవరు..? ధావన్ పాత్ర ఎలా ఉంటుంది..? వంటి విషయాలను మాత్రం ఆ వ్యక్తి వెల్లడించలేదు. 

88

ఇదిలాఉండగా ధావన్.. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న పీరియాడిక్ డ్రామా పృథ్వీ రాజ్ అని బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది ఈ సినిమా షూటింగ్ సమయంలో  అక్షయ్-ధావన్ లు కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. మరి ధావన్ నటించిన సినిమా పృథ్వీరాజేనా లేదా మరో సినిమానా అనేది తెలుసుకోవాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే. 

Read more Photos on
click me!

Recommended Stories