IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌కి అసలైన విలన్ అతనే... కాస్త ఆ ఆవేశాన్ని తగ్గించుకుంటే...

First Published Oct 11, 2021, 7:14 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ ఒకడు. ఫస్టాఫ్‌లో ఆవేశ్ ఖాన్ ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా టీమిండియా నుంచి పిలుపు కూడా వచ్చింది. ఇంగ్లాండ్ టూర్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన ఆవేశ్ ఖాన్, ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడి జట్టుకి దూరమయ్యాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన ఆవేశ్ ఖాన్, 23 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్ 2లో నిలిచాడు...

మొదటి క్వాలిఫైయర్‌లో ఆవేశ్ ఖాన్ సరైన సమయంలో వికెట్లు తీయకపోగా ధారళంగా పరుగులు సమర్పించాడు. ఓ రకంగా ఆవేశ్ ఖాన్ పర్ఫామెన్సే, ఢిల్లీ ఓటమికి కారణం...

ఆవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్‌లో 8 పరుగులు రాగా, ఆరో ఓవర్‌లో రాబిన్ ఊతప్ప, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత 17వ ఓవర్‌లో 9 పరుగులు, 19వ ఓవర్‌లో 11 పరుగులు ఇచ్చాడు...

‘ఆవేశ్ ఖాన్ లాంటి అనుభవం లేని బౌలర్‌లో డెత్ ఓవర్లలో రెండు ఓవర్లు వేయించడం కరెక్ట్ కాదు. రబాడా ఫామ్‌లో లేడు, కానీ అతనికి డెత్‌ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడంలో మంచి రికార్డు ఉంది...

కగిసో రబాడా ఓ వరల్డ్ క్లాస్ బౌలర్. టామ్ కుర్రాన్‌‌కి బదులుగా ఆఖరి ఓవర్‌ అయినా రబాడాకి ఇచ్చి ఉంటే రిజల్ట్ బాగుండేది...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్...

లీగ్ స్టేజ్‌లో రెండుసార్లు ఎమ్మెస్ ధోనీ వికెట్ తీసిన ఆవేశ్ ఖాన్, మాహీకి వేసిన మొదటి బంతిని అద్భుతంగా వేశాడు. అయితే ఆ తర్వాతి బంతికి అతనిలో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది...

19వ ఓవర్ మొదటి బంతికి రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేసి, బ్రేక్ అందించినా.. ఆ తర్వాత మాహీకి ఎంతో ఇష్టమైన షార్ట్ వికెట్ బంతిని వేశాడు ఆవేశ్ ఖాన్. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ధోనీకి వేసిన మూడు బంతుల్లో ఓ సింగిల్ లేదా, రెండు పరుగులు వచ్చి ఉంటే మ్యాచ్ ఫలితమే వేరేగా ఉండేది...

టామ్ కుర్రాన్ అప్పటిదాకా అద్భుతంగా బౌలింగ్ చేసినా... ఎమ్మెస్ ధోనీకి బౌలింగ్ చేస్తున్నాననే ప్రెషర్ అతనిలో స్పష్టంగా కనిపించింది...

మాహీని ఎలా అడ్డుకోవాలో తెలియక టామ్ కుర్రాన్ వేసిన బంతులు, సుదీర్ఘ అనుభవం ఉన్న ధోనీని ఇబ్బంది పెట్టలేకపోయాయని అంటున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు...

అంతకుముందు ఆర్‌సీబీతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చివరి బంతి వేయడానికి ముందే షాట్ మిస్ చేసిన శ్రీకర్ భరత్‌ను చూసి నవ్వి, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న ఆవేశ్ ఖాన్, మరోసారి విమర్శకులకు టార్గెట్ అయ్యాడు.  

click me!