IPL 2021: ఆఖరి పొజిషన్‌లో ఉన్నా, ఆ విషయంలో మాత్రం మనోళ్లే టాప్... సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల రికార్డు...

First Published Oct 11, 2021, 5:30 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఏ విషయంలోనూ సరిగ్గా కలిసి రాలేదు. 14 లీగ్ మ్యాచుల్లో మూడంటే మూడు విజయాలు మాత్రమే అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, 6 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచి ఘోరమైన పరాభవాన్ని చవిచూసింది...

సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం, జట్టు ప్రదర్శనపై తీవ్రంగా ప్రభావం చూపగా ఆటగాళ్ల గాయాలు కూడా తీవ్రంగా వెంటాడాయి...

ఫస్టాఫ్‌‌లో నటరాజన్ గాయం కారణంగా జట్టుకి దూరం కావడం, సెకండాఫ్ ప్రారంభానికి ముందు కరోనా బారిన పడడంతో అతను జట్టుకి అందుబాటులో ఉండలేకపోయాడు...

మంచి ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్ స్టో, టీమిండియా మీద కోపంతో సెకండాఫ్‌కి రాకపోవడం కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది...

ఇవన్నీ పక్కనబెడితే ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచినా, ఓ విషయంలో మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన జట్ల కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎన్నడూ లేనట్టుగా పర్పుల్ క్యాప్ రేసులో టాప్ 4లో భారత బౌలర్లే నిలిచారు. టాప్ 10లో స్వదేశీ బౌలర్లను పక్కనబెడితే, మిగిలింది ఇద్దరే విదేశీ బౌలర్లు...

14 మ్యాచుల్లో 18 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్, టాప్ 5లో ఉంటే, 8 మ్యాచుల్లోనే 16 వికెట్లు తీసిన జాసన్ హోల్డర్ టాప్ 10లో ఉన్నాడు...

అలాగే టాప్ 15లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ క్రిస్ మోరిస్ 11 మ్యాచుల్లో 15 వికెట్లు తీసి టాప్ 12లో ఉండగా, 14 మ్యాచుల్లో 14 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ 14వ పొజిషన్‌లో ఉన్నాడు...

పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫారిన్ బౌలర్లు పర్పామెన్స్ విషయంలో టాప్‌లో ఉంటే, ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు వారి తర్వాతి స్థానంలో ఉండడం విశేషం...

ఈ నలుగురు కాకుండా అత్యధిక వికెట్లు తీసిన టాప్ 15లో మిగిలిన 11 మంది కూడా భారత బౌలర్లే కావడం విశేషం... 

14 మ్యచుల్లో 30 వికెట్లు తీసిన ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్ టాప్‌లో ఉంటే, 23 వికెట్లతో ఢిల్లీ యంగ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ రెండో స్థానంలో, బుమ్రా 21 వికెట్లతో మూడు, షమీ 19 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు...

అర్ష్‌దీప్ సింగ్ 18 వికెట్లతో టాప్ 6లో ఉండగా, శార్దూల్ ఠాకూర్ 18 వికెట్లతో ఏడో స్థానంలో, వరుణ్ చక్రవర్తి 16 వికెట్లతో 8, యజ్వేంద్ర చాహాల్ 16 వికెట్లతో 9వ స్థానంలో ఉన్నారు...

టాప్ 10లో ఉన్నవారిలో హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, చాహాల్ మాత్రమే పర్పుల్ క్యాప్ రేసులో నిలిచారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వీరిలో 30 వికెట్లతో ఉన్న హర్షల్ పటేల్, పర్పుల్ క్యాప్ గెలవడం దాదాపు ఖాయమే..

click me!