IPL2021: ధోనీ ఆ షాట్ కొట్టగానే ఏడ్చేసిన సాక్షి సింగ్... స్టాండ్స్‌లో హంగామా అంతా ధోనీ భార్యదే...

Published : Oct 11, 2021, 06:10 PM IST

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మాస్ జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మాహీ కంటే ఆయన సతీమణి సాక్షి సింగ్‌కే క్రేజ్ ఎక్కువ. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సాక్షి సందడి కనిపించింది...

PREV
111
IPL2021: ధోనీ ఆ షాట్ కొట్టగానే ఏడ్చేసిన సాక్షి సింగ్... స్టాండ్స్‌లో హంగామా అంతా ధోనీ భార్యదే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, తన రేంజ్‌కి తగ్గ ఒక్కటంటే ఒక్క పర్ఫామెన్స్ కూడా ఇవ్వలేకపోయాడు... బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అవుతూ వచ్చాడు...

211

అదీకాకుండా పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని ఆవేశ్ ఖాన్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, రవి భిష్ణోయ్‌ల బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ...

311

అందుకే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాహీ చేసింది 18 పరుగులే అయినా... మ్యాచ్ ఫినిష్ చేయడానికి సరిపోయిన ఆ పరుగులు ధోనీ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించాయి...

411

ఈ ఇన్నింగ్స్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేసింది ధోనీ భార్య సాక్షి సింగ్. 19 పరుగులు కావాల్సిన దశలో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ధోనీ కొట్టిన సిక్సర్‌కి ఎగిరి గంతేసి, పక్కనే ఉన్న సీఎస్‌కే సపోర్టర్‌ను హత్తుకుంది సాక్షి సింగ్...

511

ఆ తర్వాతి ఓవర్‌లో వరుస ఫోర్లు కొడుతూ, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. విన్నింగ్ షాట్ కొట్టిన సమయంలో భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేసింది సాక్షి సింగ్...
(photo source- iplt20.com)

611

తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాకపోయినా, సాక్షి ఏడవడాన్ని చూసి తట్టుకోలేకపోయిన జీవా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. స్టేడియంలో సీఎస్‌కే సపోర్టర్లు కూడా ఎమోషనల్ అయి, ఏడ్చేశారు..
(photo source- iplt20.com)

711

ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు, ఆనందభాష్పాలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సాక్షి ఇంతలా ఎమోషనల్ అవ్వడానికి కారణం ధోనీపై వచ్చిన ట్రోలింగ్...
(Photo source- Instagram) 

811

మాహీ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. కానీ సాక్షి సింగ్ మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ధోనీపై వచ్చే ట్రోల్స్ అన్నీ గమనిస్తూ ఉంటుంది...
(photo Source- www.iplt20.com)

911

అందుకే ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి సీఎస్‌కే తప్పుకున్న తర్వాత ఆటలో గెలుపు, ఓటములు సహజం అంటూ అందరికంటే ముందుగా పోస్టు చేసింది సాక్షి సింగ్ ధోనీ...
(photo Source- www.iplt20.com)

1011

ఈ సీజన్‌లో మాహీ కేవలం ఓ కెప్టెన్‌గా మాత్రమే కనిపిస్తున్నాడని, అతను బ్యాట్స్‌మెన్ చేసిందేమీ లేదంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటికి రెండు మార్కుల ఆన్సర్ అయినా సరైన సమాధానంగా వచ్చింది క్వాలిఫైయర్ మ్యాచ్‌లో వచ్చిన ధనాధన్ ఇన్నింగ్స్...
(Photo Source- Instagram)

1111

అందుకే ఆనందంతో భావోద్వేగానికి లోనైంది సాక్షి సింగ్. పబ్లిక్ ఏమనుకుంటున్నాడో పట్టించుకోకుండా తన భావోద్వేగాలను ప్రదర్శించడం సాక్షి సింగ్‌కి ముందునుంచే అలవాటు...

click me!

Recommended Stories