పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చతికిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 165 పరుగుల టార్గెట్‌ను ఈజీగా చేధించింది...
డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన జాసన్ రాయ్, ఎస్‌ఆర్‌హెచ్ తరుపున ఆడిన తన మొట్టమొదటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...
జాసన్ రాయ్‌కి తోడు వార్నర్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కేన్ విలియంసన్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి విజయం అందించారు...
ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇంకా ప్లేఆఫ్ ఆశలు మిలుకు మిలుకుమంటూ సజీవంగానే మిగిలాయి... టాప్ 3లో ఉన్న చెన్నై, ఢిల్లీ, బెంగళూరు కాకుండా మిగిలిన జట్లు, లీగ్‌లో మిగిలిన మ్యాచుల్లో ఓడి, సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన మ్యాచుల్లో విజయాలు అందుకుంటే ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది...
అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో డేవిడ్ వార్నర్ స్టేడియంలో ఎక్కడా కనిపించలేదు. ఫస్టాఫ్‌లో ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వార్నర్‌కి తుదిజట్టులో చోటు దక్కలేదు...
అయితే ఆ మ్యాచ్‌లో డగౌట్‌లో కూర్చుని కనిపించిన డేవిడ్ వార్నర్, ప్లేయర్లకు డ్రింక్స్ తీసుకెళుతూ... బాల్ అందిస్తూ ఆటలో ఎలాగైనా భాగం కావాలని ఆతృత పడడం కనిపించింది...
సెకండాఫ్‌లో మాత్రం తనకి తుదిజట్టులో చోటు లేదని తెలుసుకున్న డేవిడ్ వార్నర్, తన రూమ్‌లోనే కూర్చొని మ్యాచ్ చూశాడు. అందుకే స్టేడియంలో ఎక్కడా వార్నర్ కనిపించలేదు...
అయితే డేవిడ్ వార్నర్ అభిమానులు మాత్రం అతను స్టేడియంలో కనిపించకపోవడం బాగా హార్ట్ అయ్యారు. ‘స్టేడియంలో ఎక్కడా వార్నర్ భాయ్ కనిపించలేదు. అతను వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడతాడా?’ అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ పోస్టు కింద కామెంట్లు కనిపించాయి...
‘వార్నర్ భాయ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను వదిలి వెళ్తున్నాడంటే నాకు ఏడుపు వస్తోంది... అతను ఎందుకు స్టేడియంలో కనిపించలేదు...’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు ఫ్యాన్స్...
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏం పోస్టు చేసినా, దానికి వెంటనే స్పందించి, కామెంట్ పెట్టే డేవిడ్ వార్నర్, ఈ కామెంట్లపై స్పందించాడు... ‘సారీ... ఇకపై అలా జరగదు... దయచేసి ఎల్లప్పుడూ మీ సపోర్ట్ కావాలి...’ అంటూ రిప్లై ఇచ్చాడు వార్నర్...
అయితే డేవిడ్ వార్నర్ కామెంట్‌ను ఇంకోలా అర్థం చేసుకున్న కొందరు... ‘ఇకపై స్టేడియంలోకి రాకపోవచ్చు... మీ సపోర్ట్ కావాలి...’ అంటూ చెబుతున్నట్టుగా అర్థం చేసుకుని, సోషల్ మీడియాలో వార్తలు అల్లేశారు...
జాసన్ రాయ్ ఫస్ట్ మ్యాచ్‌లోనే సక్సెస్ కావడంతో డేవిడ్ వార్నర్‌కి మిగిలిన నాలుగు మ్యాచుల్లో చోటు దక్కకపోవచ్చని, అలా చూసుకుంటే అతన్ని ఆరెంజ్ ఆర్మీ జెర్సీలో ఇదే ఆఖరు కావచ్చని అంటున్నారు మరికొందరు...