సరిగా ఆడలేదని బూతులు తిట్టాడు... విరాట్ కోహ్లీపై బీసీసీఐకి రవిచంద్రన్ అశ్విన్ ఫిర్యాదు...

First Published Sep 28, 2021, 3:52 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి మొదటి నాలుగు టెస్టుల్లోనూ చోటు దక్కకపోవడం ఆ సమయంలో హాట్ టాపిక్ అయ్యింది... ఆ సమయంలోనే భారత సారథి విరాట్ కోహ్లీకి, రవిచంద్రన్ అశ్విన్‌కి గొడవైందని కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు వట్టి పుకార్లు కాదని, వాటిల్లో నిజం ఉందని తెలుస్తోంది... 

ఆఫ్ ఫీల్డ్ ఎంతో వినయంగా నడుచుకుంటూ, ఫన్నీగా అందరితో కలిసిపోయి నవ్వుతూ నవ్వించే విరాట్ కోహ్లీ... ఆన్ ది ఫీల్డ్ మాత్రం చాలా అగ్రెసివ్... ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేశారని అనుకుంటే సొంత జట్టు ప్లేయర్లపై కూడా నోరుపారేసుకుంటూ ఉంటాడు కోహ్లీ...

గత ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ ప్రవర్తన బాగోలేదని ఓ సీనియర్ ప్లేయర్, బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది... అతను మరెవ్వరో కాదు, రవిచంద్రన్ అశ్విన్....

ఇంగ్లాండ్ టూర్‌లో న్యూజిలాండ్‌తో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన టీమిండియా, ఆ తర్వాత నెలన్నర గ్యాప్ తీసుకుని ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టులు ఆడింది...

ఐదో టెస్టు ఆరంభానికి ముందు భారత బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో మాంచెస్టర్ టెస్టును అర్ధాంతరంగా రద్దు చేసుకున్న ప్లేయర్లు, ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకున్నారు...

అయితే ఇంగ్లాండ్ టూర్‌లో విరాట్ కోహ్లీ తనతో ప్రవర్తించిన విధానం సరిగా లేదని, భారత జట్టుకి ఎన్నో మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్ అని కూడా చూడకుండా తనను అవమానించాడంటూ బీసీసీఐకి అశ్విన్  ఫిర్యాదు చేసినట్టు సమాచారం...

బాల్‌తో పెద్దగా వికెట్లు తీయకపోయినా జడేజాని నాలుగు టెస్టుల్లో ఆడించిన కోహ్లీ, ప్రధాన స్పిన్నర్ రవి అశ్విన్‌ని మాత్రం పక్కనబెట్టేశాడు..  డగౌట్‌లో అశ్విన్ నిరాశగా కూర్చోవడం స్పష్టంగా కనిపించింది...

రెండో టెస్టు ఆరంభానికి ముందు కూడా తుదిజట్టులో తనకి చోటు ఉందని చెప్పిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత మాట మార్చాడని కూడా కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్..

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రవిచంద్రన్ అశ్విన్ కీలక సమయంలో బాల్‌తో రాణించి, తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు... వికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న టీమిండియాకి బ్రేక్ అందించింది అశ్వినే...

అలాగే రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అందరూ ఫెయిల్ అయినా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రం రెండు వికెట్లు తీసి ఒంటరి పోరాటం చేశాడు...

అయితే రవిచంద్రన్ అశ్విన్ పర్ఫామెన్స్‌తో సంతృప్తి చెందని విరాట్ కోహ్లీ, ఆ మ్యాచ్ తర్వాత నోరు పారేసుకున్నాడని... తన మాటలతో బాగా మనస్తాపం చెందిన భారత సీనియర్ స్పిన్నర్, బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం...

రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ మధ్య గొడవల కారణంగానే రవీంద్ర జడేజా బాల్‌తో రాణించకపోయినా అతనికి ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కలేదని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి కూడా రవిచంద్రన్ అశ్విన్‌ని ఎంపిక చేయడం విరాట్ కోహ్లీకి ఇష్టం లేదని, కేవలం రోహిత్ శర్మ కారణంగానే సెలక్టర్లు అతనికి అవకాశం ఇచ్చారని సమాచారం...

click me!