మేం క్రికెటర్లం, మాకు కొంచెం గౌరవం కావాలి... రిషబ్ పంత్‌‌ విషయంలో ఏం జరిగిందో చెప్పిన చాహాల్...

First Published Oct 10, 2021, 6:44 PM IST

రిషబ్ పంత్... టీమిండియాలోకి అతని ఎంట్రీ ఓ సెన్సేషన్, ఐపీఎల్‌ కెప్టెన్సీలోనూ అంతే! ఢిల్లీ క్యాపిటల్స్‌ను మొట్టమొదటిసారి ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్‌ను పక్కనబెట్టి, రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించారంటే అతని కెప్టెన్సీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...

వాస్తవానికి ఐపీఎల్ 2020 సీజన్‌కి ముందు రిషబ్ పంత్ పరిస్థితి వేరు. ఆరంభంలో టెస్టుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్‌లు ఇచ్చినా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాహీ ఉండడంతో పంత్‌కి కుదురుకోవడానికి చాలా సమయమే పట్టింది...

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీని పక్కనబెట్టి, వరుసగా రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపిక చేయడం మొదలెట్టింది బీసీసీఐ...

ఆ సమయంలో రిషబ్ పంత్ క్యాచ్ వదిలేసినా, స్టంపౌట్ మిస్ చేసినా... ఆఖరికి బ్యాటింగ్‌లో సరిగా రాణించకపోయినా స్టేడియంలో ప్రేక్షకులు గోల గోల చేసేవాళ్లు... 

‘అవును, అందరూ రిషబ్ పంత్‌, మాహీలా ఆడాలని ఆశపడ్డారు. స్టంప్స్ వెనకాల ధోనీ ఎలా ఉంటాడో, అలా మెరుపులా పంత్ కదలాలని కోరుకున్నారు....

నాకు ఇప్పటికీ గుర్తుంది... 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత పంత్ క్యాచ్ డ్రాప్ చేసినా, డీఆర్‌ఎస్ రివ్యూ ఫెయిల్ అయినా.. స్టేడియం మొత్తం ‘మాహీ... మాహీ...’ అంటూ అరిచేవాళ్లు...

ఇది రిషబ్ పంత్‌ని తీవ్ర ఒత్తిడిలోకి పడేసింది. అతని వయసు 19, 20 ఏళ్లు. ఆ కుర్రాడు, ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయలేకపోయాడు. ఎన్నో సార్లు ఏడ్చేసేవాడు...

మేం అతనికి ఇవన్నీ పట్టించుకోవద్దని, కేవలం గేమ్‌పైన ఫోకస్ పెట్టాలని చెప్పాం... అయితే ఒత్తిడిని తట్టుకోలేక పూర్ పర్ఫామెన్స్‌తో కొన్నిరోజులు జట్టుకి కూడా దూరమయ్యాడు...

అతనిచ్చిన కమ్‌బ్యాక్ సూపర్బ్... తనని తాను ఎంతో మెరుగుపరుచుకున్నాడు. ఇప్పుడు అతనిలో చాలా మెచ్యూరిటీ కనిపిస్తోంది. పర్ఫామెన్స్ కూడా చాలా మెరుగైంది...

ఇప్పుడు బౌలర్లకు వికెట్ల వెనుక నుంచి రిషబ్ పంత్ చాలా సాయం చేస్తున్నాడు. ఏ ప్లేయర్‌ని అయినా రిప్లేస్ చేయడం అసాధ్యం... 

మాహీ భాయ్ లాంటి ప్లేయర్‌ని రిప్లేస్ చేసే క్రికెటర్ దొరకడు. అలాగే రిషబ్ పంత్ కూడా. ఎవరి ఆట వారిది. జనాలు ఆటను అర్థం చేసుకున్నట్టే ఆటగాళ్లను కూడా అర్థం చేసుకోవాలి...

ఎవ్వరూ కూడా కావాలని బ్యాడ్ పర్ఫామెన్స్ ఇవ్వాలనుకోరు. కొన్నిసార్లు అలా జరిగిపోతుంటుంది. మేం క్రికెటర్లం, మాకు కొంచెం గౌరవం కావాలి. ప్రతీ ప్లేయర్ కోరుకునేది అదే...’ అంటూ చెప్పుకొచ్చాడు యజ్వేంద్ర చాహాల్...

click me!