IPL 2021: మాహీ మాటల్లో అది కనిపించడం లేదు, నాకైతే నమ్మకం లేదు... షేన్ వాట్సన్ కామెంట్స్...

First Published Oct 10, 2021, 6:05 PM IST

క్రికెట్‌లో డెడికేషన్ చూపించడంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల తర్వాతే ఎవ్వరైనా... గాయమైనా పట్టించుకోరు, రక్తం కారుతున్నా అంతా ఈజీగా క్రీజ్ వదలరు. అలాంటి వారిలో షేన్ వాట్సన్ ఒకడు...

ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్‌లో కాలికి గాయమై, రక్తం కారుతున్నా అలాగే బ్యాటింగ్ కొనసాగించి... అందర్నీ ఆశ్చర్యపరిచాడు షేన్ వాట్సన్...

వరుస మ్యాచుల్లో విఫలమవుతున్నా, తనపై నమ్మకం ఉంచి వరుసగా అవకాశాలు ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ మీద ఉన్న గౌరవంతోనే ఇలా బ్యాటింగ్ చేశానని చెప్పాడు షేన్ వాట్సన్...

తాజాగా 2021 సీజన్ తర్వాత ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్‌లో కొనసాగుతాడా? లేక క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించి మెంటర్‌గా బాధ్యతలు తీసుకుంటాడా? అనేది సస్పెన్స్‌గా మారింది.

దీనిపై సూటిగా సమాధానం చెప్పని ఎమ్మెస్ ధోనీ, ఓసారి తన ఆఖరి మ్యాచ్‌లో చెన్నై అభిమానుల మధ్య ఆడతానని, మరోసారి వచ్చే సీజన్‌లో సీఎస్‌కేకి ఆడతానా? లేదా? జట్టు రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉంటుందని చెప్పి అభిమానులను కంఫ్యూజ్ చేశాడు...

‘ఎమ్మెస్ ధోనీ మాటలు వింటుంటే, నాకు నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో చెప్పినంత నమ్మకంగా, దృఢంగా తన మాటలు లేవు... 

వచ్చే సీజన్‌లో కచ్ఛితంగా ఆడతానని ఐపీఎల్ 2020 సీజన్‌లో కామెంట్ చేసిన ధోనీ, ఈసారి మాత్రం అలా చెప్పకుండా వేలంలో ఏమవుతుందో చూద్దాం, రిటెన్షన్ పాలసీ వచ్చాక తెలుస్తుంది... అంటూ నసుగుతున్నాడు...

అతని మాటలను బట్టి నాకైతే, ఎమ్మెస్ ధోనీ వచ్చే సీజన్‌లో ఆటగాడిగా కొనసాగడని, మెంటర్‌గా సీఎస్‌కేకి అందుబాటులో ఉంటాడని అనిపిస్తోంది...

ఎమ్మెస్ ధోనీ లాంటి ప్లేయర్‌ మెంటర్‌గా ఉండడం చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్టుకి ఎంతో బలాన్ని ఇస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వాట్సన్...

40 ఏళ్ల ఎమ్మెస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ధోనీ మహా అయితే ఒకటి లేదా రెండు సీజన్లు మాత్రమే ఆడతాడు...

అలాంటి ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే, సుదీర్ఘ కాలం అందుబాటులో ఉండే ప్లేయర్‌ను వేలానికి వదిలేయాల్సి ఉంటుంది... కాబట్టి ఆటగాడిగా కొనసాగాలని ఎమ్మెస్ ధోనీ అనుకుంటే, వచ్చే మెగా వేలంలో పాల్గొనక తప్పదు...

click me!