IPL 2021: పిల్లల డైపర్లు మార్చడం కంటే స్పీడ్‌గా టీమ్‌లో మార్పులు చేస్తున్నారు... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్!

First Published Sep 23, 2021, 6:21 PM IST

ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటి... 13 సీజన్లలో మొదటి సీజన్‌లో ప్లేఆఫ్ చేరిన పంజాబ్, ఆ తర్వాత 2014లో ఫైనల్ చేరింది... అంతే మిగిలిన అన్ని సీజన్లలో దారుణంగా ఫెయిల్ అయ్యింది...

యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో 2008 సీజన్ ఆడిన పంజాబ్ కింగ్స్, ప్లేఆఫ్ చేరి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి సీజన్‌లో ఐదో స్థానానికే పరిమితం కావడంతో కెప్టెన్‌ని మార్చింది పంజాబ్ కింగ్స్...

ఆ తర్వాత కుమార సంగర్కర, జయర్థనే, ఆడమ్ గిల్‌క్రిస్ట్, డేిడ్ హుస్సీ, జార్జ్ బెయిలీ, డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రవిచంద్రన్ అశ్విన్... ఇలా పంజాబ్ కింగ్స్ మార్చినంత కెప్టెన్లను మరే జట్లు మార్చలేదేమో...

గత సీజన్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆరో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్, ఈ సీజన్‌లో కూడా అతనికే కెప్టెన్సీ అప్పగించింది. అయితే 9 మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన పంజాబ్ కింగ్స్... దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే...

మిగిలిన ఐదు మ్యాచుల్లో ఐదు గెలిస్తేనే... పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగలుగుతుంది... జట్టులో మార్పులపై సీరియస్ అయ్యాడు మాజీ పంజాబ్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్...

‘పంజాబ్ కింగ్స్ జట్టులో మార్పులు చూస్తుంటే, చిన్నపిల్లల డైపర్లు కూడా ఇంత వేగంగా మార్చరేమో అనిపిస్తోంది... ఆడిన మ్యాచుల కంటే వారి తుదిజట్టులో చేసిన మార్పులే చాలా ఎక్కువగా ఉన్నాయి...

క్రిస్ గేల్ లాంటి ప్లేయర్‌ను పెట్టుకుని, అతన్ని ఆడించడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారేమో అర్థం కాదు... పంజాబ్‌కి సరైన డెత్ బౌలర్ లేడు, అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు డెత్ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేశారు...

క్రిస్ జోర్డాన్ లాంటి ప్లేయర్‌కి తుదిజట్టులో చోటు ఇచ్చి ఉంటే, అతను పరుగులు కూడా చేయడంలో సాయపడేవాడు. ఫస్టాఫ్‌లో ఆకట్టుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్‌ షారుక్ ఖాన్‌ను ఎందుకు ఆడించలేదు...

రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్ ప్లేయర్లు లేరు. అయినా సరే పంజాబ్‌పై విజయాన్ని అందుకోగలిగిందంటే దానికి కారణం అందరికీ తెలిసిందే..

పంజాబ్ తుదిజట్టులో మార్పులు చేస్తూ ఉంటే, ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్పడం కష్టం. అలాంటప్పుడు వాళ్లు మానసికంగా, శారీరకంగా ఎలా సిద్దంగా ఉండగలరు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

Chris Gayle-Photo Credit BCCI

రవి బిష్ణోయ్ వంటి యంగ్ స్పిన్నర్ ఆకట్టుకుంటున్నా అతనికి తుది జట్టులో చోటు కల్పించలేదు పంజాబ్ కింగ్స్. గత సీజన్‌లో మొదటి ఆరు మ్యాచులకు క్రిస్‌గేల్‌ని దూరంగా పెట్టాడు కెఎల్ రాహుల్. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన క్రిస్ గేల్... ఐదు మ్యాచుల్లో వరుస విజయాలు అందించాడు...

click me!