IPL 2021: సంజూ శాంసన్‌కి, ఆ సీనియర్‌కి పడడం లేదా... ఓ అంతఃముఖుడికి కెప్టెన్సీ ఇవ్వడం...

Published : Sep 23, 2021, 04:03 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటతీరు, గత సీజన్ కంటే బెటర్‌గానే కనిపిస్తోంది. ఇప్పటిదాకా 8 మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచి, నాలుగింట్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్... పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో నాలుగు, కనీసం మూడు గెలిచినా సరిపోద్ది...

PREV
112
IPL 2021: సంజూ శాంసన్‌కి, ఆ సీనియర్‌కి పడడం లేదా... ఓ అంతఃముఖుడికి కెప్టెన్సీ ఇవ్వడం...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో లక్కీగా సూపర్ విక్టరీ అందుకుంది రాజస్తాన్ రాయల్స్. 19వ ఓవర్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ కట్టుదిట్టమైన బౌలింగ్, 20వ ఓవర్‌లో కార్తీక్ త్యాగి మ్యాజిక్ వర్కవుట్ అవ్వడంతో 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది...

212

అయితే ఈ మ్యాచ్ క్షుణ్ణంగా గమనించినవారికి ఓ విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. సౌతాఫ్రికా సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ బౌలింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ అసహనానికి గురి కావడం...

312

వాస్తవానికి ఎమ్మెస్ ధోనీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ వంటి ప్లేయర్లతో పోలిస్తే... సంజూ శాంసన్ చాలా సైలెంట్. అంతఃముఖుడు... పెద్దగా మాట్లాడడం, ఓవర్‌గా సెలబ్రేట్ చేసుకోవడం, తన భావోద్వేగాలను ఎక్స్‌ప్రెస్ చేయడం వంటివి సంజూ శాంసన్‌‌లో కనిపించవు...

412

రిషబ్ పంత్, ఎమ్మెస్ ధోనీ, దినేశ్ కార్తీక్ వంటి వికెట్ కీపర్లు బౌలర్లను ఎంకరేజ్ చేస్తూ, వికెట్ల వెనకాల ఎలా వేయాలో సలహాలు ఇస్తూ, కామెంటరీతో మిగిలిన ప్లేయర్లలో జోష్ నింపుతూ ఉంటారు...

512

సంజూ శాంసన్ అలా కాదు. చాలా సైలెంట్. వికెట్ల వెనకాల తన పనేదో తాను చూసుకుంటూ ఉంటాడు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ప్లేయర్లు, బ్యాట్స్‌మెన్‌గా... బౌలర్‌గా రాణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కెప్టెన్‌ అన్నవాడు, తాను ఏమనుకుంటున్నాడో ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి...

612

ప్లేయర్లు చేసే పొరపాట్లను సరిదిద్ధుతూ, కలిసికట్టుగా ఆడేలా వారిలో ఉత్సాహం నింపగలగాలి. సంజూ శాంసన్ ఆ లక్షణాలైతే కనిపించడం లేదు... ముఖ్యంగా సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌కి, సంజూ శాంసన్‌కి మధ్య మనస్పర్థలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది...

712

ఫస్టాఫ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో క్రిస్ మోరిస్‌కి స్ట్రైయిక్ ఇవ్వడానికి ఇష్టపడలేదు సంజూ శాంసన్. రన్ కోసం సగం దూరానికి పైగా పరుగెత్తుకుంటూ వచ్చిన క్రిస్ మోరిస్, సంజూ శాంసన్ నిరాకరించడంతో షాక్‌కు గురయ్యాడు...

812

ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో క్రిస్ మోరిస్‌ను ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.. అంత భారీ ధర పెట్టినా కూడా ఆఖరి బంతికి సిక్స్ కొట్టగలడని మోరిస్‌పై శాంసన్ నమ్మకం వ్యక్తం చేయకపోవడం అందర్నీ షాక్‌కి గురి చేసింది...

912

ఆ సంఘటన తర్వాత ‘అలాంటి అవకాశం ఎన్నిసార్లు వచ్చినా, నేను స్ట్రైయిక్ ఇవ్వనని’ కామెంట్ చేశాడు సంజూ శాంసన్. స్టైయిక్ ఇవ్వకపోవడం, ఈ కామెంట్లతో క్రిస్ మోరిస్ బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది...

1012

ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన క్రిస్ మోరిస్, రాజస్థాన్ రాయల్స్‌కి అద్భుత విజయాన్ని అందించాడు..

1112

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన క్రిస్ మోరిస్, 47 పరుగులు సమర్పించాడు. ఇందులో ఏకంగా ఆరు వైడ్లు ఉండడం విశేషం. దీంతో మోరిస్‌ని ఏమీ అనలేక, నిశ్శబ్దంగా కళ్లతోనే అసహనాన్ని చూపించాడు సంజూ శాంసన్...

1212

మరి ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు, రాజస్థాన్ రాయల్స్‌ని ఎంతగా ఇబ్బంది పెడతాయోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు... 

click me!

Recommended Stories