IPL 2021: నేను బాగానే కెప్టెన్సీ చేశా, అయినా... రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వడంపై శ్రేయాస్ అయ్యర్ కామెంట్...

First Published Sep 23, 2021, 4:51 PM IST

ఐపీఎల్ చరిత్రలో 13 సీజన్లలో ఫైనల్ చేరని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తొలిసారి ఫైనల్ చేర్చాడు శ్రేయాస్ అయ్యర్. మూడు సీజన్లలో ఢిల్లీకి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

ఢిల్లీ క్యాపిటల్స్ 2008 నుంచి 2012 వరకూ కెప్టెన్‌గా వ్యవహరించిన వీరేంద్ర సెహ్వాగ్, జట్టును మూడుసార్లు ప్లేఆఫ్స్‌కి చేర్చాడు... ఆ తర్వాత ఎవ్వరూ కూడా అంత సక్సెస్ కాలేకపోయారు...

గౌతమ్ గంభీర్, దినేశ్ కార్తీక్, జయవర్థనే, రాస్ టేలర్, కేవిన్ పీటర్సన్, జేపీ డుమినీ, జహీర్ ఖాన్ వంటి ప్లేయర్లు ఢిల్లీ జట్టును నడిపించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు...

2013 నుంచి 2018 వరకూ కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ఈ ఆరేళ్లలో అత్యుత్తమంగా ఆరో స్థానంలో మాత్రమే నిలవగలిగింది...

సెహ్వాగ్‌ను వదులుకున్న తర్వాత జట్టు పర్ఫామెన్స్ మరింతగా పడిపోవడంతో ఫ్రాంఛైజీ పేరును, లోగోను, జెర్సీని మార్చి, యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్‌కి కెప్టెన్సీ అప్పగించింది ఢిల్లీ క్యాపిటల్స్...

2018లో గంభీర్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న శ్రేయాస్ అయ్యర్, 2019లో ఢిల్లీ జట్టును ఆరేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కి తీసుకెళ్లాడు...

2019 సీజన్‌లో గ్రూప్ స్టేజ్‌లో టాపర్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, 2020లో తొలిసారిగా ఫైనల్‌కి దూసుకెళ్లింది... అయితే మొట్టమొదటి ఢిల్లీని ఫైనల్ చేర్చినా, అయ్యర్‌ కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది...

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, 2021 సీజన్ ఫస్టాఫ్‌లో అందుబాటులో ఉండకపోవడంతో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్...

తొలిసారి కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించాడు శ్రేయాస్ అయ్యర్... ‘తొలిసారి నాకు కెప్టెన్సీ ఇచ్చినప్పుడు నా ఆలోచనా విధానం పూర్తి భిన్నంగా ఉంది... ఢిల్లీకి ఎలాగైనా టైటిల్ అందించాలని అనుకున్నా... 

కెప్టెన్‌గా నా నిర్ణయాలు జట్టుకి విజయాలను అందించాయి. విజయానికి ఏం చేయాలో అదే చేశాను. ఢిల్లీ కెప్టెన్‌గా మారిన తర్వాత నా ఆటతీరు కూడా మెరుగైంది... 

రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. ఈ సీజన్‌లో పంత్ కెప్టెన్సీ బాగుంది, అదే కొనసాగుతుందని ఆశిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...

2021 సీజన్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో 9 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్, 7 విజయాలు అందుకుని ప్లేఆఫ్ రేసుకి అడుగు దూరంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో గెలిస్తే, నేరుగా ఫ్లేఆఫ్ చేరుతుంది ఢిల్లీ క్యాపిటల్స్...

click me!