IPL 2021: విరాట్ భాయ్ చెప్పిన ఆ మాటలే, నేను ఇలా ఆడడానికి కారణం... ఇషాన్ కిషన్ కామెంట్...

First Published Oct 9, 2021, 9:32 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇషాన్ కిషన్ క్లిష్టపరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనవసర షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అవుతూ అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కారణంగా కొన్ని మ్యాచుల్లో జట్టులో చోటు కూడా కోల్పోయాడు ఇషాన్ కిషన్... 

కీలక మ్యాచుల్లో ముంబై ఓపెనర్ డి కాక్ ఫెయిల్ అవుతూ ఉండడంతో కీలక సమయంలో అతని స్థానంలో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కి అవకాశం వచ్చింది...

రాకరాక వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకుని, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తన ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నాడు ఇషాన్ కిషన్...

‘టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు నేను ఫామ్‌లోకి రావడం చాలా సంతోషాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. మెగా టోర్నీకి ముందు వచ్చిన ఈ పరుగులు నాలో ఆత్మవిశ్వాసాన్ని, పాజిటివ్ థింకింగ్‌ను పెంచాయి...

మేం 250- 260 పరుగులు చేయాలని అనుకున్నాం. అందుకే మొదటి ఓవర్‌ నుంచే షాట్స్ ఆడాలని డిసైడ్ అయ్యాను. ఈ టోర్నీలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండాలి...

విరాట్ భాయ్‌తో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. టీ20 వరల్డ్‌కప్‌లో నువ్వు ఓపెనర్‌గా సెలక్ట్ అయ్యావ్, దాని కోసం ప్రిపేర్ అవు... అని చెప్పారు, ఆ మాటలు నాలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి...

నాకు ఓపెనింగ్ చేయడం ఎప్పుడూ ఇష్టమే. టీ20 వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఓపెనింగ్ చేసే అవకాశం దక్కుతుంటే దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఫిక్స్ అయ్యా...

జస్ప్రిత్ బుమ్రా భాయ్‌ కూడా నాకు ఎంతగానో సాయం చేశాడు. హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా నాకు మద్ధతుగా నిలిచారు. జట్టులోని ప్రతీ ఒక్కరూ నాకు అండగా నిలవడం వల్లే నేను మళ్లీ ఫామ్‌లోకి రాగలిగాను...

నేను చేస్తున్న తప్పులేంటో తెలుసుకున్నా, అందుకే అవి రిపీట్ చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఇషాన్ కిషన్...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్, తాను ఎదుర్కొన్న మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు...

16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్, 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి 2021 ఐపీఎల్ సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు..

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి 8 మ్యాచుల్లో కలిపి 107 పరుగులు మాత్రమే చేసిన ఇషాన్ కిషన్, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో కలిపి 134 పరుగులు చేసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు... 

click me!