IPL 2021: విరాట్ కోహ్లీ మళ్లీ అదే తప్పు, టాస్ గెలిచి మరీ ఇలాంటి నిర్ణయమా...

Published : Oct 11, 2021, 09:32 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌, ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఆఖరి సీజన్... లీగ్ దశలో మంచి పర్పామెన్స్ చూపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టాప్ 3 ప్లేస్‌తో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది...

PREV
113
IPL 2021: విరాట్ కోహ్లీ మళ్లీ అదే తప్పు, టాస్ గెలిచి మరీ ఇలాంటి నిర్ణయమా...

కెప్టెన్‌గా ఆఖరి సీజన్ కావడంతో ఈసారి ఎలాగైనా టైటిల్ గెలిచి, విరాట్ కోహ్లీకి కానుకగా ఇవ్వాలని భావించారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు...

213

అయితే వారి ఆలోచనలకు వింత నిర్ణయాలతో తానే బ్రేకులు వేస్తున్నాడు విరాట్ కోహ్లీ... ముఖ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచి విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..

313

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కి కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఛేదనలో మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ప్లేఆఫ్స్‌లో నాలుగు సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన కేకేఆర్, నాలుగుసార్లు విజయాలు అందుకుంది...

413

అలాంటి కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం వ్యూహాత్మక తప్పిదం అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

513

అయితే విరాట్ కోహ్లీ మాత్రం పిచ్ చూడడానికి చక్కగా ఉందని, బ్యాటింగ్‌కి అనుకూలించే కనిపిస్తుందని కామెంట్ చేశాడు... అయితే ఆర్‌సీబీ ఇన్నింగ్స్ చూస్తే మాత్రం సీన్ అలా లేదు...

613

విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్, డాన్ క్రిస్టియన్ వంటి భారీ హిట్టర్లు ఉన్న ఆర్‌సీబీ, 20 ఓవర్లలో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయింది...

713

మొదటి ఐదు ఓవర్లలో 49 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్, భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టే కనిపించింది. అంతలోనే వికెట్లు పడడం, వచ్చిన ప్లేయర్లు బౌండరీలు కొట్టడానికి తెగ ఇబ్బంది పడడం స్పష్టంగా కనిపించింది.

813

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన చూసి తట్టుకోలేకపోయిన ఫ్యాన్స్, ఆర్‌సీబీ కావాలనే ఇలా ఆడి ఓడిపోతుందని ఆవేదనతో ‘రాయల్ ఫిక్సర్ ఛాలెంజర్స్’ అనే ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు...

913

దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి, అందరి దృష్టిని ఆకర్షించిన మహ్మద్ అజారుద్దీన్ లాంటి యంగ్ ప్లేయర్‌ను టీమ్‌లో పెట్టుకుని ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

1013

 

వరుసగా ఫెయిల్ అవుతున్నా, డాన్ క్రిస్టియన్‌కి వరుస అవకాశాలు కల్పిస్తూ కొనసాగిస్తుండడం కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమైంది.

1113

ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కెరీర్ ఈ సీజన్‌తో ఫుల్ స్టాప్ పడనుంది. ప్లేయర్‌గా కొనసాగుతానని మాట ఇచ్చినా, ఫామ్‌లో లేకపోతే ఏ ప్లేయర్ అయినా ఏ జట్టులో శాశ్వతంగా ఉండలేడని చాలాసార్లు రుజువైంది...

1213

ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కెరీర్ ఈ సీజన్‌తో ఫుల్ స్టాప్ పడనుంది. ప్లేయర్‌గా కొనసాగుతానని మాట ఇచ్చినా, ఫామ్‌లో లేకపోతే ఏ ప్లేయర్ అయినా ఏ జట్టులో శాశ్వతంగా ఉండలేడని చాలాసార్లు రుజువైంది...

1313

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రదర్శనతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ, తీవ్ర విమర్శలతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా కనిపిస్తున్నాడు. 

click me!

Recommended Stories