IPL 2021: ఎమ్మెస్ ధోనీని ‘ఫిక్సింగ్ కింగ్’ అంటున్న నెటిజన్స్... ఇర్ఫాన్ పఠాన్ రియాక్షన్ ఇదే...

Published : Oct 11, 2021, 07:59 PM ISTUpdated : Oct 11, 2021, 08:01 PM IST

క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్‌కి ఉండే క్రేజ్ వేరు. క్రికెట్ మ్యాచులు చూడని వాళ్లు కూడా ఐపీఎల్ మ్యాచులను ఎంజాయ్ చేస్తూ చూస్తారు. అయితే ఐపీఎల్‌ మ్యాచులపై ఎన్నో ఏళ్లుగా ఫిక్సింగ్ కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి...

PREV
110
IPL 2021: ఎమ్మెస్ ధోనీని ‘ఫిక్సింగ్ కింగ్’ అంటున్న నెటిజన్స్... ఇర్ఫాన్ పఠాన్ రియాక్షన్ ఇదే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇలాంటి ఫిక్సింగ్ కామెంట్లు చాలానే వినిపించాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఈ విమర్శలు విపరీతంగా వచ్చాయి...

(Photo Source-www.iplt20.com)

210

ఆఖరి ఓవర్‌లో కేవలం 4 పరుగులు చేయలేక 2 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది పంజాబ్ కింగ్స్. ఈ ఓటమి పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని విమర్శలు వచ్చాయి...

310

అలాగే లీగ్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో అయితే ఈ ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి...

410

ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్ కారణంగా ఐదు ఓవర్లలోనే 78 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. దీంతో ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు ‘ఫిక్సింగ్’, ‘అంబానీ’ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కనిపించాయి...

510

చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌ సమయంలోనూ ఈ విధమైన కామెంట్లు వినిపించాయి...

610

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అంపైర్లతో ఏదో విషయం గురించి చర్చించాడు...

710

దీంతో అంపైర్లతో కలిసి ఎమ్మెస్ ధోనీ ఫిక్సింగ్‌కి పాల్పడుతున్నాడని విమర్శిస్తూ.. ‘ఫిక్సింగ్ కింగ్’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు కొందరు అభిమానులు...

810

ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారానే స్పందించాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్... ‘ముంబై ఇండియన్స్ క్రేజీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, కొందరు ఫ్యాన్స్ ఏదేదో ఊహించుకున్నారు...

910

నిన్న చెన్నై గెలిచిన తర్వాత కూడా ఇలాగే ఆలోచించారు... మీకు నచ్చిన టీమ్‌కి సపోర్ట్ చేయడం మంచిదే, అలాగే ప్రత్యర్థి జట్టుకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి...

1010

అవతలి జట్టు గెలిచినప్పుడు, ఆ విజయాన్ని కూడా గౌరవించాలి. వాళ్లు ఆడిన విధానం బాగుందని అంగీకరించాలి. అంతేకానీ అడ్డమైన చెత్త ఊహించుకోకూడదు...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

click me!

Recommended Stories