ఐపీఎల్‌లో ఆరేసిన రాబిన్ ఊతప్ప... అత్యధిక జట్లకు ఆడిన టాప్ 10 ప్లేయర్లు వీరే...

First Published Oct 4, 2021, 10:10 PM IST

క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి ఉండే క్రేజ్ వేరు. సత్తా ఉంటే, వయసు, అనుభవంతో సంబంధం లేకుండా ప్లేయర్ల కోసం కోట్లు గుమ్మరించడానికి సిద్ధంగా ఉంటాయి ఫ్రాంఛైజీలు... అయితే ఈ సీజన్‌లో ఓ జట్టుకి ఆడిన ప్లేయర్, వచ్చే ఏడాది అదే జట్టుకి ఆడతాడనే నమ్మకం లేదు. అలా అత్యధిక జట్లకి ఆడిన టాప్ 10 ప్లేయర్లు వీరే...

టాప్ 10 బ్రెండన్ మెక్‌కల్లమ్: 2008లో కేకేఆర్ తరుపున ఆడుతూ బ్రెండన్ మెక్‌కల్లమ్ కొట్టిన 158 పరుగుల విధ్వంసం, ఐపీఎల్ ఫ్యాన్స్ ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ తర్వాత కొచ్చి టస్కర్స్, గుజరాత్ లయర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకి ఆడాడు ప్రస్తుత కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్...

టాప్ 9 ఆశీష్ నెహ్రా: భారత సీనియర్ పేసర్ ఆశీష్ నెహ్రా తన కెరీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో ఆరంభించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్, పూణె, చెన్నై, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు నెహ్రా...

టాప్ 8 రాబిన్ ఊతప్ప: ఈ సీజన్‌లో ఢిల్లీతో మ్యాచ్ ద్వారా సీఎస్‌కే తరుపున ఆరంగ్రేటం చేశాడు రాబిన్ ఊతప్ప. ఇంతకుముందు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకి ఆడాడు రాబిన్ ఊతప్ప...

ఐపీఎల్‌లో మూడుసార్లు టైటిల్ గెలిచిన సీఎస్‌కే, ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై, రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ కేకేఆర్ జట్ల తరుపున ఆడిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు రాబిన్ ఊతప్ప. ఇంతకుముందు హర్భజన్ సింగ్ ఈ మూడు జట్లకీ ఆడాడు...

టాప్ 7 తిసారా పెరేరా: శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారి పెరారా, ఐపీఎల్‌లో ఆరు జట్లకి ఆడాడు. 2008లో సీఎస్‌కే తరుపున ఆడిన పెరేరా, ఆ తర్వాత కొచ్చి టస్కర్స్ కేరళ, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పూణే సూపర్ జెయింట్స్ జట్లకి ఆడాడు..

టాప్ 6 ఇషాంత్ శర్మ: భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్, పంజాబ్ జట్లకి ఆడి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడుతున్నాడు..

టాప్ 5 ఇర్ఫాన్ పఠాన్: భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, 2008లో తన కెరీర్‌ను పంజాబ్ కింగ్స్‌తో మొదలెట్టాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, పూణె సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లకి ఆడాడు...

టాప్ 4 యువరాజ్ సింగ్: భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, ఐపీఎల్‌లో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ప్లేయర్... ఐపీఎల్‌లో 2008లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టాడు యువీ...

ఆ తర్వాత పూణే వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ వంటి జట్లకి ఆడాడు యువరాజ్ సింగ్...

టాప్ 3 దినేశ్ కార్తీక్: కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన దినేశ్ కార్తీక్... తన ఐపీఎల్ కెరీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మొదలెట్టాడు. ఆ తర్వాత పంజాబ్, ముంబై, బెంగళూరు, గుజరాత్ లయర్స్‌‌కకి ఆడి కేకేఆర్‌లో సెటిల్ అయ్యాడు...

టాప్ 2 పార్థివ్ పటేల్: ఐపీఎల్‌లో అత్యధిక జట్లకి ఆడిన భారత ప్లేయర్‌గా టాప్‌లో ఉన్నాడు పార్థివ్ పటేల్. ఈ భారత వికెట్ కీపర్ తన కెరీర్‌‌ను సీఎస్‌కేతో మొదలెట్టి కొచ్చి, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకి ఆడాడు పార్థివ్ పటేల్...

టాప్ 1 ఆరోన్ ఫించ్: ఆస్ట్రేలియా వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఐపీఎల్‌లో 8 జట్లకి ఆడాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన ఫించ్, ఆ తర్వాత రెండేళ్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ఆ తర్వాత పూణె వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, పంజాబ్, గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఫించ్ అమ్ముడుపోలేదు..

click me!