వాళ్లిద్దరినీ అనవసరంగా సెలక్ట్ చేశారు, ఛాన్స్ రాగానే... సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్...

First Published Oct 5, 2021, 4:56 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి భారత జట్టును ఎంపిక చేసిన సమయంలో ఎలాంటి ట్రోల్ రాలేదు... అయితే ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో కొందరు క్రికెటర్ల పర్ఫామెన్స్ కారణంగా బీసీసీఐ సెలక్టర్లు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది...

గత మూడు ఐపీఎల్ సీజన్లలో 400+ పరుగులు చేసి, సెలక్టర్లను, క్రికెట్ విశ్లేషకులను విపరీతంగా ఆకర్షించి టీమిండియాలోకి వచ్చాడు సూర్యకుమార్ యాదవ్... 

వస్తూనే సిక్సర్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలెట్టి, షార్ట్ కెరీర్‌లో మంచి పర్ఫామెన్స్ చూపించిన సూర్యకుమార్ యాదవ్, ఆడిన నాలుగు టీ20ల్లో 46.33 యావరేజ్‌తో నిలకడైన ప్రదర్శన చూపించాడు...

శ్రేయాస్ అయ్యర్ కంటే మెరుగైన స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసే సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేశారు బీసీసీఐ సెలక్టర్లు...

సూర్యకుమార్ యాదవ్‌తో పాటే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడే ఇషాన్ కిషన్, గత సీజన్‌లో 500+ పరుగులు చేసి డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్‌లో హైయెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు...

టీ20ల్లో, వన్డేల్లో ఫోర్ బాది అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించిన ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్ కంటే మెరుగైన ఓపెనర్‌గా, సంజూ శాంసన్ కంటే నిలకడైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా భావించారు సెలక్టర్లు...

వీరిని టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేయడంపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లు జట్టులో ఉంటే, టీమిండియా టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తమైంది...

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో ఈ ఇద్దరూ ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. అప్పుడు పొగిడిన నోళ్లే, ఇప్పుడు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి... తాజాగా ఈ లిస్టులో సునీల్ గవాస్కర్ కూడా చేరాడు...

‘టీమిండియా క్యాప్ తీసుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ చాలా రిలాక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ఆటతీరు చూస్తుంటే, పెద్ద షాట్స్ ఆడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది...

మేం టీమిండియా ప్లేయర్లం కాబట్టి ఇలాంటి షాట్స్ ఆడాలనే ధోరణి వారిలో కనిపిస్తోంది. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. షాట్ సెలక్షన్ కరెక్టుగా ఉంటేనే, పరుగులు వస్తాయి...

ఇప్పుడు ఈ ఇద్దరిలో అది కనిపించడం లేదు. అందులో ఈ ఇద్దరూ త్వరగా అవుట్ అవుతున్నారు... ఈ ఇద్దరినీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేయకపోయి ఉంటే, ఇంతకుముందులానే ఆడేవాళ్లేమో...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2021 సీజన్‌లో 13.27 సగటుతో 107 పరుగులు చేసి, తుది జట్టులో చోటు కూడా కోల్పోగా... సూర్యకుమార్ యాదవ్ 18.50 సగటుతో 222 పరుగులు చేశాడు...

click me!