అయ్యర్ వల్ల కానిది, రిషబ్ పంత్ చేసి చూపించాడు... ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయం వెనక బీసీసీఐ హస్తం...

First Published Oct 5, 2021, 4:16 PM IST

ఐపీఎల్‌లో 13 సీజన్లలో ఫైనల్ చేరని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తొలిసారి ఫైనల్‌కి తీసుకెళ్లిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. అయితే ఆ తర్వాతి సీజన్‌లోనే శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ కోల్పోవాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు...

ఫస్టాఫ్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్‌కి దూరం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలిక కెప్టెన్‌గా రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది ఢిల్లీ క్యాపిటల్స్...
(photo Source- www.iplt20.com)

అయితే ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో రిషబ్ పంత్ నాయకత్వ లక్షణాలు, అతను జట్టును నడిపించిన తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో చూపించిన దూకుడు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది...

ఈ కారణంగానే మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకుని,ఫేజ్ 2 సమయానికి అందుబాటులో వచ్చినా... అతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి ఇష్టపడలేదు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్...

ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఐపీఎల్‌ కెరీర్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అయ్యర్‌కి కెప్టెన్సీ ఇవ్వకుండా, రిషబ్ పంత్‌నే కెప్టెన్‌గా కంటిన్యూ చేయాలనే నిర్ణయం వెనక బీసీసీఐ పెద్దల హస్తం ఉందని సమాచారం...

విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు కొన్ని నెలల క్రితమే బీసీసీఐ పెద్దలకు సమాచారం ఇచ్చారట... కోహ్లీ తర్వాత టీమిండియాను నడిపించే సారథి కోసం వెతుకులాట మొదలెట్టింది బీసీసీఐ..

టీ20ల్లో రోహిత్ శర్మకు కెప్టెన్సీ దక్కడం దాదాపు ఖాయమైపోయినా, అతను ఎక్కువ కాలం ఆ పొజిషన్‌లో కొనసాగడం అసాధ్యం. మహా అయితే మరో రెండు, మూడేళ్లు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ కొనసాగే అవకాశం ఉంది...

ఆ తర్వాత అప్పటికప్పుడు కొత్త కెప్టెన్‌ ఎవరనే చర్చ రాకుండా ముందుగానే ఫ్యూచర్ కెప్టెన్‌ని వెతికే పనిలో పడింది భారత క్రికెట్ బోర్డు...

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఫ్యూచర్ కెప్టెన్‌గా కనిపించినా... అతని స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రిషబ్ పంత్... అయ్యర్ కంటే డిఫరెంట్ స్టైల్‌లో జట్టును నడిపిస్తూ సూపర్ సక్సెస్ అయ్యాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ముంబై ఇండియన్స్‌తో జరిగిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడింది... సీఎస్‌కేతో రెండు విజయాలు అందుకున్నా, గత సీజన్‌లో వారి ఫామ్ సరిగా లేదు...

రిషబ్ పంత్ కెప్టెన్సీలో 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై లీగ్ మ్యాచుల్లో విజయాలు అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్....

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫామ్‌లో లేకపోయినా, టాప్‌లో ఉన్న సీఎస్‌కేని రెండు మ్యాచుల్లో చిత్తు చేసి టాప్ ప్లేస్‌కి అధిరోహించింది... 

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత విజయాలు అందుకోవడంతో, మరోసారి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఆ మ్యాజిక్ రిపీట్ చేయగలడని నమ్ముతున్నారు అభిమానులు, విశ్లేషకులు....
(photo Source- www.iplt20.com)

ఈ సీజన్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్ టైటిల్ గెలిస్తే కనుక.... రోహిత్ శర్మను కాదని, విరాట్ కోహ్లీ వారసుడిగా ఈ యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్‌ను కెప్టెన్‌గా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం...

click me!