IPL2021 MI vs KKR: నా కెప్టెన్సీలో అతన్ని వన్‌డౌన్‌లో ఆడించనందుకు ఫీల్ అవుతున్నా... గంభీర్ కామెంట్...

First Published Sep 23, 2021, 6:53 PM IST

ఐపిఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు టీమిండియాలో సెన్సేషనల్ స్టార్ స్టేటస్ కూడా సంపాదించి, టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు...

సూర్యకుమార్ యాదవ్ టాలెంట్‌ను గుర్తించి, అతనికి వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహించింది మాత్రం కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్...

‘నా ఐపీఎల్ కెరీర్‌లో నాకు అన్నీ దక్కాయి. అయితే సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్‌ను టాపార్డర్‌లో ఆడించకనందుకు నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నా...

అతన్ని ఫినిషర్‌గా చూసిన నేను, టాపార్డర్‌లో అతను అద్భుతం చేయగలడని గుర్తించనందుకు బాధపడుతున్నా...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

2012లో ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, ఒకే ఒక్క మ్యాచ్ డకౌట్ అయ్యాడు... దాంతో మళ్లీ అతనికి అవకాశం రాలేదు..

ఆ తర్వాత కేకేఆర్ తరుపున 2014లో ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, 2015లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 46 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు... 

గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్, 2018 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్‌కి మారాడు.

2018 వేలంలో కేకేఆర్‌తో పోటీపడి రూ.3.20 కోట్లకు సూర్యకుమార్ యాదవ్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, అతన్ని వన్‌డౌన్ ప్లేయర్‌గా, టూ డౌన్‌ ప్లేయర్‌గా ఆడించి సక్సెస్ సాధించింది...

2018 నుంచి వరుసగా మూడు సీజన్లలో 400+ పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 2020 ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలో స్థానం సంపాదించుకున్నాడు...

అంతర్జాతీయ కెరీర్‌లో ఎదుర్కొన్న మొట్టమొదటి బంతికే సిక్సర్ బాదిన సూర్యకుమార్ యాదవ్, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు...

click me!