IPL 2022: ప్లేయర్లు మాత్రమే కాదు, ఆ కోచ్‌లకు కూడా లక్నో గాలం... పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి...

First Published Dec 2, 2021, 10:39 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇస్తున్న కొత్త టీమ్‌ లక్నోపై వచ్చిన, వస్తున్న ఆరోపణలు అంతా ఇంతా కాదు. రూ.7 వేల కోట్లకు పైగా మొత్తం చెల్లించి, ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్న ఆర్‌పీ‌ఎస్... ప్లేయర్ల కోసం కూడా భారీ ధర చెల్లించడానికి సిద్ధమవుతోందంటూ వార్తలు వస్తున్నాయి...

ఇప్పటికే పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి దూరమైన మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్‌కి లక్నో టీమ్‌ రూ.20 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం...

అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, తనకి ఫస్ట్ రిటెన్షన్ (రూ.16 కోట్లు) కావాలని పట్టుబట్టడానికి కూడా లక్నో టీమ్ కారణమని వార్తలు వచ్చాయి...

రషీద్ ఖాన్ కోసం లక్నో జట్టు రూ.16 కోట్లు చెల్లించడానికి సిద్ధమైందని, త్వరలోనే అతను ఆ జట్టులో చేరబోతున్నాడంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి...

అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్‌కి లక్నో జట్టు రూ.10 కోట్లు ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చిందని, అయితే సిరాజ్ మాత్రం రూ.7 కోట్ల ఆర్‌సీబీ డీల్‌కే ఓకే చెప్పాడని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

తాజాగా అందుతున్న వార్తల  ప్రకారం పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ఆ జట్టును వీడి, లక్నో టీమ్‌కి పనిచేయబోతున్నాడట...

‘అవును. ఆండీ, పంజాబ్ కింగ్స్ జట్టును వదిలేశాడు. తనకి వచ్చిన మిగిలిన అవకాశాలను వాడుకోవాలని ఆయన భావించారు. మేం ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు పంజాబ్ కింగ్స్ సహ-యజమాని నెస్ వాడియా...

అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్ కూడా చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడని సమాచారం. ఆరెంజ్ ఆర్మీ కూడా దీన్ని కన్ఫార్మ్ చేసింది...

2012, 2014  సీజన్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి టైటిల్ అందించిన కోచ్‌గా ఉన్న ట్రేవర్, 2019 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్‌కి హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు...

వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో చేరిన ట్రేవర్ కూడా లక్నో జట్టులో చేరబోతున్నట్టు సమాచారం... ‘అవును, ట్రేవర్ బేలిస్, హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త కోచ్‌ను త్వరలోనే ప్రకటిస్తాం...’ అంటూ తెలిపింది సన్‌రైజర్స్..

ఈ ఇద్దరితో పాటు భారత జట్టు మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్, ఆర్‌సీబీ మాజీ కోచ్ డానియల్ విటోరీలను కూడా లక్నో జట్టు సంపద్రించినట్టు సమాచారం..

click me!