ఎన్ని సార్లు ఫెయిల్ అయినా అజింకా రహానేకి మరో ఛాన్స్... అతన్ని తప్పించి విరాట్ కోహ్లీకి ప్లేస్...

First Published Dec 2, 2021, 9:37 AM IST

కాన్పూర్ టెస్టు మ్యాచ్‌లో ఒకే ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని కోల్పోయి, డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్‌లో రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ, ముంబై టెస్టులో రీఎంట్రీ ఇస్తుండడంతో టీమిండియాకి కొత్త సమస్య ఎదురైంది...

విరాట్ కోహ్లీ గైర్హజరీతో టెస్టు ఆరంగ్రేటం చేసిన శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానంలో అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టిన అయ్యర్, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు...

ఆరంగ్రేటం టెస్టులోనూ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...

శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోవడంతో రెండో టెస్టులో అతన్ని తప్పించలేని పరిస్థితి. ఇదే సమయంలో వైస్ కెప్టెన్ అజింకా రహానే మరోసారి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 63 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించిన అజింకా రహానే, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరి, పేలవ ఫామ్‌ను కొనసాగించాడు..

మెల్‌బోర్న్ టెస్టు సెంచరీ తర్వాత అజింకా రహానే సగటు కనీసం 20 పరుగులు కూడా దాటకపోవడం, టీమిండియాను ఇబ్బందిపెడుతున్న విషయం... దీంతో ఐదో స్థానంలో రాణించిన అయ్యర్‌ను అట్టిపెట్టి, రహానేని టీమ్‌ నుంచి తప్పిస్తారని భావించారంతా...

అయితే టీమిండియాకి ఎన్నో విజయాలు అందించిన  అజింకా రహానేని తప్పించడం ఇష్టం లేని టీమిండియా మేనేజ్‌మెంట్‌, విరాట్ కోహ్లీ కోసం ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను పక్కనబెట్టాలని నిర్ణయం తీసుకుందట...

2020 ఆస్ట్రేలియా టూర్ వరకూ టెస్టుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు మయాంక్ అగర్వాల్. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు...

ఇప్పటికే రెండు డబుల్ సెంచరీ కూడా చేసి, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గానూ నిలిచాడు. అయితే కొన్నాళ్లుగా అతనికి తగినన్ని అవకాశాలు దక్కడం లేదు...

ఆసీస్ టూర్‌లో తొలి రెండు టెస్టుల్లో అగర్వాల్ ఫెయిల్ కావడం, శుబ్‌మన్ గిల్ ఎంట్రీతోనే ఇంప్రెస్ చేయడంతో మయాంక్ టీమ్‌లో ప్లేస్ కోల్పోవాల్సి వచ్చింది. ఆసీస్ టూర్‌లో ఆఖరి రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లుగా చేశారు...

గబ్బా టెస్టులో హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ గాయపడడంతో మయాంక్ అగర్వాల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించింది భారత జట్టు. అయితే ఓపెనర్ మయాంక్, మిడిల్ ఆర్డర్‌లో మెప్పించలేకపోయాడు...

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి మయాంక్ అగర్వాల్‌ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయాలని భావించింది బీసీసీఐ. అయితే తొలి టెస్టుకి ముందు మయాంక్ అగర్వాల్ గాయపడడంతో అతని స్థానంలో కెఎల్ రాహుల్‌ తిరిగి టెస్టు ఎంట్రీ ఇచ్చాడు...

రీఎంట్రీతోనే రోహిత్ శర్మతో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పడంతో మయాంక్ అగర్వాల్‌ను పక్కనబెట్టి... కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించింది భారత జట్టు...

న్యూజిలాండ్‌తో సిరీస్‌కి ముందు కెఎల్ రాహుల్ గాయపడడంతో మళ్లీ మయాంక్ అగర్వాల్‌కి చోటు దక్కింది. అయితే మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ రాణించడం, తన కంటే ఘోరంగా ఫెయిల్ అవుతున్న అజింకా రహానేకి టీమ్ సపోర్ట్ ఉండడంతో మరోసారి మయాంక్ అగర్వాల్‌ను బ్యాడ్‌లక్ వెంటాడనుంది...

click me!